Last Updated:
బిగ్ బాస్ జోడీగా గుర్తింపు పొంది, రియల్ లైఫ్ లవర్స్ గా పేరు తెచ్చుకున్న డీమాన్ పవన్ – రీతూ చౌదరీ బ్రేకప్ అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి పోతే..
బుల్లితెర ప్రేక్షకులకు, సోషల్ మీడియా ఫాలోవర్స్‌కు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేర్లు రీతూ చౌదరి, డీమాన్ పవన్. జబర్దస్త్ వంటి కామెడీ షోల ద్వారా పాపులర్ అయిన రీతూ చౌదరి.. ఆ తర్వాత యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ డమ్ తెచ్చుకుంది. ఇక డీమోన్ పవన్ సైతం యూట్యూబ్, డ్యాన్స్ వీడియోల ద్వారా ఎంతో పాపులర్. బిగ్ బాస్ జోడీగా గుర్తింపు పొందిన ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో ‘రివాన్’ (Riwan) అనే హ్యాష్ ట్యాగ్‌తో మోస్ట్ పాపులర్ పెయిర్‌గా ట్రెండ్ అయ్యారు. వీరు కలిసి చేసిన ఎన్నో క్యూట్ రీల్స్, వ్లాగ్స్, షార్ట్స్ విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే, ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట తమ అభిమానులకు ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ చెప్పారు.
గత కొంతకాలంగా రీతూ చౌదరి, పవన్ మధ్య తీవ్రమైన విభేదాలు వచ్చాయని, ఇద్దరూ విడిపోతున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్లకు చెక్ పెడుతూ, తాజాగా డీమోన్ పవన్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. ఇకపై తమ మధ్య ఎలాంటి స్నేహ బంధం లేదని, అది పూర్తిగా ముగిసిపోయిందని ఆయన స్పష్టం చేశాడు. “రీతూ చౌదరితో నా సంబంధంపై వస్తున్న ట్రోల్స్, నెగెటివిటీ, ఫేక్ రూమర్లు దారుణంగా ఉన్నాయి. బిగ్ బాస్ హౌస్‌లో కనిపించేది, నిజ జీవితంలో జరిగేది పూర్తిగా వేర్వేరు. మేమిద్దరం ఎవరూ ఎవరినీ వాడుకోలేదు. అది పరస్పర అంగీకారంతో ఏర్పడిన స్వచ్ఛమైన స్నేహబంధం” అని పవన్ తన పోస్టులో పేర్కొన్నాడు.

“గత కొన్ని నెలలుగా మా మధ్య వ్యక్తిగత సమస్యలు, తీవ్రమైన గొడవలు జరుగుతున్నాయని వస్తున్న వార్తల్లో నిజం ఉంది. పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పుతుండటంతో, ఇద్దరి మనశ్శాంతి కోసం విడివిడిగా ప్రాజెక్టులు చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇప్పటికే మేమిద్దరం సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నాం. రీతూ నన్ను వాట్సాప్, స్నాప్‌చాట్‌లో బ్లాక్ చేసింది. నేను ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఆమెను రిమూవ్ చేశాను. ఆ తర్వాత ఆమె ఇన్‌స్టాలోనూ నన్ను బ్లాక్ చేసింది. అయితే నేను మాత్రం ఎలాంటి పాత పోస్టులను డిలీట్ చేయలేదు” అని పవన్ సుదీర్ఘంగా రాసుకొచ్చాడు.
ఇకపై సోషల్ మీడియాలో ‘రివాన్’ అనే కాంబినేషన్ కనిపించదని, తమ మధ్య స్నేహం పూర్తిగా తెగిపోయిందని పవన్ బాంబ్ పేల్చాడు. నెటిజన్లు దయచేసి అనవసరమైన ఊహాగానాలు ఆపేసి, తమ ప్రైవసీని గౌరవించాలని, తమకు మానసిక ప్రశాంతతను అందించాలని కోరాడు. ప్రస్తుతం పవన్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఎప్పుడూ క్యూట్‌గా కనిపించే ఈ మోస్ట్ పాపులర్ పెయిర్ ఇలా అకస్మాత్తుగా విడిపోవడం, ఒకరినొకరు బ్లాక్ చేసుకోవడం పట్ల వారి అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అసలు వీరిద్దరి మధ్య ఇంతలా విభేదాలు రావడానికి అసలు కారణం ఏమిటి? అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు.














