Rohit Sharma: కాలు జారిన హిట్‌మ్యాన్.. ప్రపంచకప్ ముంగిట రోహిత్‌కు తప్పిన పెను ప్రమాదం.. ఏం జరిగిందంటే? | క్రీడా వార్తలు | ACTPnews

రోహిత్ శర్మ


Last Updated:

Rohit Sharma: భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ జట్టు హోటల్‌కు చేరుకున్న సమయంలో ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు.

రోహిత్ శర్మ
రోహిత్ శర్మ

భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఆదివారం తిరువనంతపురంలో జరిగిన తొలి వన్డే ముగిసిన అనంతరం ఈ ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత భారత జట్టు బస్సులో హోటల్‌కు చేరుకోగా, బస్సు మెట్లు దిగుతున్న క్రమంలో రోహిత్ కాలు జారి కిందపడిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలలో కనిపించిన వివరాల ప్రకారం.. రోహిత్ శర్మ కిందపడగానే అక్కడే విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది, పోలీసులు వెంటనే అప్రమత్తమై అతడిని పైకి లేపి సహాయం చేశారు. ఈ ప్రమాదంలో రోహిత్ శర్మకు ఏమైనా గాయాలయ్యాయా లేదా అనేది ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. అయితే ‘హిట్‌మ్యాన్’ క్షేమంగానే ఉండాలని, గాయాలు కాకూడదని అభిమానులు ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ జరగనుంది. జూన్‌లో జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే సరిగ్గా 8 నెలలు ఉంది. ఇటువంటి స్థితిలో రోహిత్‌కు ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే అది అతడిని ప్రపంచకప్‌కు దూరం చేసి ఉండేది. అయితే అతడు పెద్దగా గాయపడలేదు. దాంతో అతడి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇక తొలి వన్డే మ్యాచ్ విషయానికొస్తే.. వెస్టిండీస్ విధించిన 296 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ భారత్‌కు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. రోహిత్ 25 బంతుల్లో 32 పరుగులు చేసి ఔటైనప్పటికీ, వీరిద్దరూ తొలి వికెట్‌కు 6 కంటే ఎక్కువ రన్‌రేట్‌తో 74 పరుగులు జోడించారు. ఈ శుభారంభం అనంతరం విరాట్ కోహ్లీ, గిల్‌లు మ్యాచ్‌ను ముందుకు నడిపించడంతో భారత్ 42 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed