Romanchakam: రోమాంచకం మూవీ గ్లింప్స్ రిలీజ్.. సందీప్ రెడ్డి వంగా మార్క్ కనిపిస్తోందిగా! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ప్రేక్షకులు కోరుకునే కొత్తదనంతో యూనిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది “రోమాంచకం” సినిమా. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా సమర్పిస్తుండగా, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు.

News18
News18

భద్రకాళీ పిక్చర్స్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో భారీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. ఈ కాంబోలో ఒక యంగ్ టీమ్ తో ఫ్రెష్ లవ్ స్టోరీ మూవీ వస్తోందంటే ప్రేక్షకులు కొత్తదనం ఆశిస్తారు, స్ట్రాంగ్ కంటెంట్ ఎక్స్ పెక్ట్ చేస్తారు. ప్రేక్షకులు కోరుకునే అలాంటి కొత్తదనంతో యూనిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది “రోమాంచకం” సినిమా. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా సమర్పిస్తుండగా, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. కొత్త దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన “రోమాంచకం” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేసి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

తాజాగా “రోమాంచకం” సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ డీవోపీ పవన్ పప్పుల అందించిన పెయింటింగ్ లాంటి బ్యూటిఫుల్ విజువల్స్ తో , వాసుకి వైభవ్ కంపోజ్ చేసిన స్వీట్ మెలొడియస్ ట్యూన్ తో సాగుతూ హీరోయిన్స్ మధ్య ఉన్న ప్రేమను, వారి మధ్య ఏర్పడిన దూరాన్ని చూపిస్తూ సాగింది. ‘అణువు అణువును ఉర్రూతలూపే ప్రణయ కల్లోలమే — రోమాంచకం, ఊహకే అందని ఉవ్వెత్తునెగిసే ఉత్తుంగ తరంగమే — రోమాంచకం..’ అంటూ గ్లింప్స్ లో వచ్చిన లిరిక్స్ ఈ మూవీ ఎంత వైబ్రేటింగ్ గా ఉండబోతుందో తెలియజేస్తోంది. “రోమాంచకం” సినిమా ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలగలిపి ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేందుకు వస్తోంది. సుమంత్ ప్రభాస్, అనంతిక జంట కెమిస్ట్రీ ఈ సినిమాకు హైలైట్ గా నిలుస్తోంది. “రోమాంచకం” సినిమా ఒక ఇంట్రెస్టింగ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది.

ఈ సినిమాలో సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్, ఉపేంద్ర లిమయె, వెంకటేష్ కాకుమాను, నరేంద్ర రవి, మణి, సోహన్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తుండగా వాసుకి వైభవ్ సంగీతం అందిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *