మరొక నెటిజన్ రొమాంచకం సినిమా ఒక మంచి, హృదయాన్ని హత్తుకునే ఎంటర్టైనర్ అని.. చక్కగా రాసి, అంతే అద్భుతంగా తెరకెక్కించిన సినిమా అని తెలిపాడు. సుమంత్ ప్రభాస్, అనంతిక, నరేంద్ర తమ నటనతో సినిమాకు ప్రధాన బలంగా నిలిచారని.. వీళ్ల పర్ఫార్మెన్స్ సినిమాకు మేయిన్ హైలైట్స్‌గా నిలిచాయని రాసుకొచ్చాడు. కథను నమ్మి ఈ సినిమాను తెరకెక్కించిన ప్రొడ్యూసర్‌కు అభినందనలు తెలుపుతూ.. అంచనాలను మించి ఈ సినిమా బాగుందని తెలిపాడు. ఈ సినిమా ప్రస్తుతం సైలెంట్‌గా ఉన్నా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం భారీ సౌండ్ చేయబోయే సైలెంట్ స్ట్రోమ్లా కనిపిస్తుందని చెప్పాడు.













