Sai Pallavi: రామాయణలో రాముడి పాత్ర, రణ్‌బీర్ క్యారెక్టర్.. సాయిపల్లవి క్రేజీ ఫీలింగ్స్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పౌరాణిక దృశ్యకావ్యం ‘రామాయణ’. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రామాయణలో రాముడి పాత్రపై సాయి పల్లవి రియాక్ట్ అయింది. ఆ వివరాలు చూస్తే..

News18
News18

భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, కనీవినీ ఎరుగని భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పౌరాణిక దృశ్యకావ్యం ‘రామాయణ’. బాలీవుడ్ స్టార్ నటుడు రణ్‌బీర్ కపూర్ జన్మదినం సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసిన బిహైండ్ ది సీన్స్ (BTS) వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. శ్రీరాముడి పాత్ర కోసం రణ్‌బీర్ పడిన కఠోర శ్రమ, బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్, విలువిద్య, కత్తిసాము సాధన చేసిన తీరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. హాలీవుడ్ ప్రముఖ స్టంట్ డైరెక్టర్ టెర్రీ నోటరీ నేతృత్వంలో రణ్‌బీర్ ప్రత్యేకమైన యాక్షన్ శిక్షణ పొందారు.

సాయి పల్లవి ఎమోషనల్ కామెంట్స్:

ఈ చిత్రంలో సీతాదేవిగా నటిస్తున్న నేచురల్ బ్యూటీ సాయి పల్లవి.. రణ్‌బీర్ లుక్, ఆయన అంకితభావంపై ప్రశంసల వర్షం కురిపించారు. “చిన్నతనం నుంచి నా మనసులో ముద్రపడిన శ్రీరాముడి తేజస్సు, అమాయకత్వం రణ్‌బీర్‌లో చూసి ఆశ్చర్యపోయాను. నా చిన్ననాటి రాముడే స్వయంగా కళ్లముందు నిలబడినట్లు అనిపించింది” అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

“శ్రీరాముడి పాత్రలో నటించడం కేవలం ఒక సినీ అవకాశం మాత్రమే కాదు. ఇది కోట్ల మంది భక్తుల నమ్మకం, భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ఒక మహత్తరమైన బాధ్యత” అని రణ్‌బీర్ పేర్కొన్నారు. రామాయణం వంటి పవిత్ర ఇతిహాసాన్ని వెండితెరపై ఆవిష్కరించేటప్పుడు ప్రజల నమ్మకాలకు ఏమాత్రం భంగం కలగకుండా అత్యంత జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నామని దర్శకుడు నితేష్ తివారీ తెలిపారు.

ఈ చిత్రంలో లంకాధిపతి రావణాసురుడిగా కన్నడ రాకింగ్ స్టార్ యష్, భక్త హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్నారు. ఇంకా అరుణ్ గోవిల్, లారా దత్తా, రకుల్ ప్రీత్ సింగ్, వివేక్ ఒబెరాయ్, కాజల్ అగర్వాల్, కుణాల్ కపూర్ వంటి ప్రముఖ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, ఆస్కార్ అవార్డు గ్రహీత వీఎఫ్ఎక్స్ సంస్థ డీనెగ్ (DNEG), యష్‌కు చెందిన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నాయి. ఈ మహోన్నత చిత్రం మొదటి భాగాన్ని 2026 దీపావళికి, రెండవ భాగాన్ని 2027 దీపావళికి తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేయనున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed