Salman Khan: చిక్కుల్లో స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌.. కోర్టు నోటీసులు, ఏం జరిగిందంటే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, ఆయన సోదరి అల్విరా ఖాన్‌లకు చండీగఢ్ జిల్లా కోర్టు భారీ షాక్ ఇచ్చింది. ‘బీయింగ్ హ్యూమన్’ (Being Human) జ్యువెలరీ బ్రాండ్ పేరుతో కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డారన్న తీవ్ర ఆరోపణల కేసులో కోర్టు వారికి సమన్లు జారీ చేసింది.

News18
News18

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, ఆయన సోదరి అల్విరా ఖాన్‌లకు చండీగఢ్ జిల్లా కోర్టు భారీ షాక్ ఇచ్చింది. ‘బీయింగ్ హ్యూమన్’ (Being Human) జ్యువెలరీ బ్రాండ్ పేరుతో కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డారన్న తీవ్ర ఆరోపణల కేసులో కోర్టు వారికి సమన్లు జారీ చేసింది. వారితో పాటు ‘స్టైల్ అండ్ కంటెంట్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్’ డైరెక్టర్లకు కూడా నోటీసులు పంపిన న్యాయస్థానం, అక్టోబర్ 5న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

కోట్ల రూపాయల పెట్టుబడి.. ఆపై చేతులెత్తేసిన కంపెనీ!

చండీగఢ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఫిర్యాదు వివరాల ప్రకారం.. చండీగఢ్‌లోని మణిమజ్రా ప్రాంతంలో ‘బీయింగ్ హ్యూమన్’ జ్యువెలరీ షోరూమ్‌ను ఏర్పాటు చేసేందుకు కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన హామీలను నమ్మి తాను సుమారు రూ.3 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు గుప్తా తెలిపారు. అందులో కేవలం షోరూమ్ ఇంటీరియర్, డెవలప్‌మెంట్ కోసమే రూ.కోటి ఖర్చు చేసినట్లు వివరించారు. అయితే, షోరూమ్ ప్రారంభించిన తర్వాత ఒప్పందం ప్రకారం కంపెనీ నుంచి ఎటువంటి బిజినెస్ సపోర్ట్ లభించలేదని గుప్తా ఆరోపించారు. 2020 ఫిబ్రవరి నుంచి స్టాక్ లేదా నగల సరఫరాను పూర్తిగా నిలిపివేయడంతో వ్యాపారం దెబ్బతిని, తీవ్ర నష్టాలతో స్టోర్ మూసివేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

బ్రాండ్ ఇమేజ్.. చట్టపరమైన చిక్కులు:

సామాజిక సేవా కార్యక్రమాల పేరుతో సల్మాన్ ఖాన్ ప్రారంభించిన ‘బీయింగ్ హ్యూమన్’ లైఫ్‌స్టైల్ బ్రాండ్‌కు సమాజంలో మంచి గుర్తింపు ఉంది. కానీ, ఈ ఫ్రాంచైజీ మోడల్‌పై ఇలాంటి వ్యాపార మోసం ఆరోపణలు రావడం సంచలనంగా మారింది.

గతంలో ఈ వివాదంపై సదరు సంస్థ స్పందిస్తూ.. 2018లో స్థానిక వ్యాపారవేత్తతో జరిగిన ఒప్పందంలో సల్మాన్ ఖాన్‌కు ఎటువంటి ప్రత్యక్ష ప్రమేయం లేదని, ఇది కేవలం లైసెన్సింగ్ వ్యాపారానికి సంబంధించిన విషయమని స్పష్టం చేసింది. అయినప్పటికీ, కోర్టు స్వయంగా సల్మాన్ ఖాన్, ఆయన సోదరికి సమన్లు పంపడంతో అక్టోబర్ 5న జరగనున్న తదుపరి విచారణ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed