Last Updated:
సమంత ప్రెగ్నెన్సీతో ఉందంటూ గత కొద్దిరోజులుగా వార్తల ప్రవాహం నడుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిరంజీవి చేసిన ట్వీట్ నెట్టింట సంచలనంగా మారింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త చిత్రం ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ప్రముఖ బాలీవుడ్-టాలీవుడ్ మేకర్ రాజ్ నిడిమోరు నిర్మాణంలో, విలక్షణ దర్శకురాలు బి.వి.నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద టాక్‌తో సంబంధం లేకుండా దూసుకుపోతున్న ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబడుతోంది. ఈ ఘన విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న ‘బంగారం’ టీమ్‌కు తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నుండి ఊహించని సర్ప్రైజ్, అద్భుతమైన ప్రశంసలు దక్కాయి.
సినిమా సాధించిన బ్లాక్‌బస్టర్ విజయాన్ని పురస్కరించుకుని, మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా చిత్ర బృందాన్ని తన నివాసానికి ఆహ్వానించి ఘనంగా అభినందించారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ప్రత్యేక భేటీలో దర్శకురాలు నందిని రెడ్డితో పాటు సమంత, రాజ్ నిడిమోరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి – సురేఖ దంపతులు సమంత, రాజ్ జంటకు మన సాంప్రదాయబద్ధంగా ‘సారె’ పెట్టి అపూర్వ సత్కారం చేయడం విశేషం. వారికి ఒక అందమైన పట్టుచీరతో పాటు పవిత్రమైన శంఖాన్ని బహుమతిగా అందించి, కాసేపు సినిమా ముచ్చట్లను పంచుకున్నారు.
“మా ఇంటి బంగారం సినిమా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో యాక్షన్, ఎమోషన్స్‌ను అద్భుతంగా మేళవిస్తూ నందిని రెడ్డి ఈ చిత్రాన్ని ఎంతో వినోదాత్మకంగా తెరకెక్కించారు. సమంత నటన ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా చీరకట్టులో ఆమె చేసిన ఊరమాస్ యాక్షన్ సీన్లు అద్భుతం. ఇలాంటి ఉమెన్-సెంట్రిక్ సినిమాలు తెలుగు పరిశ్రమకు ఎంతో అవసరం. చిత్ర యూనిట్ మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు. అలాగే జీవితంలో కొత్త అధ్యాయాన్ని (New Chapter) ఆహ్వానిస్తున్న సమంత – రాజ్ దంపతులకు నా ప్రత్యేక శుభాకాంక్షలు” అంటూ చిరంజీవి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టారు.
చిరంజీవి చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు టాలీవుడ్‌లో ఒక పెద్ద సెన్సేషన్‌గా మారింది. ట్వీట్ చివర్లో ఆయన ‘జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆహ్వానిస్తున్న సమంత – రాజ్ దంపతులకు శుభాకాంక్షలు’ అని ప్రస్తావించడంతో నెటిజన్లు, అభిమానులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. సమంత ప్రస్తుతం గర్భవతి (Pregnancy) అని, ఆ గుడ్ న్యూస్‌ను చిరంజీవి తన స్టైల్ లో లీక్ చేసేశారని సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. ఇటీవల కాలంలో తన సినిమాలకు సంబంధించిన టైటిల్స్, స్టోరీ లీకులను ముందే ఇచ్చేసే అలవాటున్న చిరంజీవి.. ఇప్పుడు సమంత పర్సనల్ లైఫ్ కి సంబంధించిన బిగ్ లీక్ ఇచ్చారంటూ నెటిజన్లు మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.
చిరంజీవి చూపించిన ఈ అపారమైన ఆదరణకు సమంత భావోద్వేగానికి లోనయ్యారు. చిరు పోస్ట్‌ను రీట్వీట్ చేస్తూ.. “మెగాస్టార్ చిరంజీవి గారు, మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ‘మా ఇంటి బంగారం’ చిత్రంపై మీరు చూపించిన ప్రేమ మా అందరికీ ఎంతో బూస్టింగ్ ఇచ్చింది. మీలాంటి లెజెండ్ నుండి అభినందనలు అందుకోవడం ఒక కలలా ఉంది” అని పేర్కొన్నారు. ప్రెగ్నెన్సీ లీక్ వార్తలపై సమంత నేరుగా స్పందించకపోయినా, ఈ మెగా ‘బంగారం’ మూమెంట్‌కు సంబంధించిన ఫోటోలు మాత్రం ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













