Samantha Raj: సమంతపై భర్త రాజ్ నిడిమోరు ఓపెన్ కామెంట్స్.. ఒకే ఒక్క మాట, సంచలనం అంతే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

సమంత సత్తాను తక్కువగా అంచనా వేశారు అంటూ ఆమె భర్త రాజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

News18
News18

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు లీడ్ రోల్ లో నటించిన ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaaram) థియేటర్లలో సంచలనం సృష్టిస్తోంది. లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా, విడుదలై ఐదు రోజులు కూడా తిరక్కుండానే ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్ల వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది. సమంత నటన, పవర్‌ఫుల్ స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను థియేటర్లకు భారీగా రప్పిస్తున్నాయి.

ఈ చిత్ర అద్భుత విజయంతో పాటు బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, సమంతతో సుదీర్ఘ అనుబంధం ఉన్న రాజ్ నిడిమోరు (రాజ్ & డీకే ద్వయం) ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో సమంత స్టార్ పవర్, మహిళా ప్రాధాన్యత చిత్రాలపై ఉన్న ముందస్తు అంచనాలను కొందరు ఎలా తక్కువగా చూశారో ఆయన వివరించారు.

సమంత సత్తాను తక్కువగా అంచనా వేశారు: సినిమా విడుదలకు ముందు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని రాజ్ ఈ సందర్భంగా పంచుకున్నారు. ‘‘మా ఇంటి బంగారం’ రిలీజ్ కావడానికి కొన్ని రోజుల ముందు మా చిత్రబృందం ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ వ్యక్తిని కలిసింది. సినిమాపై పబ్లిక్ టాక్ ఎలా ఉందో తెలుసుకోవాలని ప్రయత్నించాం. కానీ ఆయన చెప్పిన సమాధానం మమ్మల్ని తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. ‘ప్రస్తుతానికి ఎవరూ ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం లేదు. అయినా.. సాధారణంగా మహిళా ప్రాధాన్యత చిత్రాలపై పెద్దగా అంచనాలు ఉండవు. థియేటర్‌లోకి వచ్చాక బాగుంటే చూస్తారు.. లేదంటే లేదు’ అని ఆయన ముఖం మీదే చెప్పారు” అని రాజ్ పేర్కొన్నారు.

ఆ సమయంలో ఆ మాటలు ఎంతో కఠినంగా అనిపించినప్పటికీ, వ్యాపార కోణంలో నిజమేనేమో అని చిత్రబృందం భావించిందని రాజ్ అన్నారు. కానీ, మొదటి రోజు కలెక్షన్స్ చూశాక ఇండస్ట్రీ లెక్కలన్నీ మారిపోయాయని ఆయన స్పష్టం చేశారు. “మొదటి రోజు వసూళ్లు వచ్చాక మాకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. కేవలం తన పేరుతోనే థియేటర్లకు జనాలను భారీగా తీసుకువచ్చే అద్భుతమైన కెపాసిటీ సమంతకు ఉంది. ఈ ఓపెనింగ్స్ ఇండస్ట్రీకి ఆ విషయాన్ని మరోసారి గట్టిగా గుర్తుచేశాయి” అన్నారు.

బాక్సాఫీస్ వద్ద సరికొత్త మైలురాయి:

ప్రస్తుతం కమర్షియల్ సినిమాల హవా నడుస్తున్న తరుణంలో, ఒక నటి ఒంటిచేత్తో సినిమాను నడిపించి ఐదు రోజుల్లో రూ. 50 కోట్లు సాధించడం సామాన్యమైన విషయం కాదు. గతంలో ‘యశోద’, ‘శాకుంతలం’ వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో మెప్పించిన సమంత, ‘మా ఇంటి బంగారం’ చిత్రంతో తన మార్కెట్ స్టామినాని మరోస్థాయికి తీసుకెళ్లారు. లాంగ్ రన్‌లో ఈ చిత్రం మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed