కెరీర్ పరంగా చూస్తే, సమంత సోనీ లివ్ తమిళ్‌తో ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. “ఈ ఏడాది నాకు ఎన్నో మార్పులను స్వీకరించడం, కొత్త ఆరంభాలను ఆహ్వానించడం నేర్పింది. సోనీ లివ్‌తో కలిసి ఈ కొత్త జర్నీ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఒక క్రేజీ ప్రాజెక్ట్‌పై వర్క్ చేస్తున్నాం, త్వరలోనే పూర్తి వివరాలు పంచుకుంటాను” అని ఆమె తెలిపారు. తాజా సమాచారం ప్రకారం, సోనీ లివ్ రూపొందించే ఒక భారీ సెలబ్రిటీ టాక్ షోకు సమంత హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. దీనికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు చెన్నైలో శరవేగంగా జరుగుతున్నాయి. ఈ షో కంటెంట్ మరింత డిఫరెంట్ గా ఉండనుందట. ఇందులో సెలబ్రిటీల ప్రేమ రహస్యాలు మెయిన్ హైలైట్ కానున్నాయట.













