Last Updated:
జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, నరేష్, అజయ్ ఘోష్, సంపూర్ణేష్ బాబు, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న కొత్త సినిమా చోర శికామణులు. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు.
శ్రీకరి-వివాన్ సమర్పణలో శ్రీకరి క్రియేషన్స్ బ్యానర్ పై బానూరు నాగరాజు నిర్మిస్తున్న చిత్రం ‘చోర శికామణులు’. ఆనంద్ కుర్మా ఈ మూవీకి కథ, కథనం, మాటలు అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్, క్రైమ్, కామెడీ జానర్‌లో రానున్న ఈ మూవీలో రామ్ తేజ్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, నరేష్, అజయ్ ఘోష్, సంపూర్ణేష్ బాబు, మురళీధర్ గౌడ్, అప్పు, కరణ్, జబర్దస్త్ సత్య శ్రీ తదితరులు ముఖ్య పాత్రలను పోషించనున్నారు.
‘చోర శికామణులు’ చిత్ర ప్రారంభోత్సవం, పూజా కార్యక్రమాలకు త్రినాథరావు నక్కిన, దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముహూర్తపు సన్నివేశానికి దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్, త్రినాథరావు నక్కిన స్క్రిప్ట్ అందించగా.. తొలి సన్నివేశానికి త్రినాథరావు నక్కిన గౌరవ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి ఆనంద్ రాజావిక్రమ్ సంగీత దర్శకుడిగా, జగదీష్ కొమరి కెమెరామెన్‌గా, యాక్షన్ కొరియోగ్రఫీ బాధ్యతలను డ్రాగన్ ప్రకాష్ నిర్వహించనున్నారు.
జూలై 25 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మంచి సాంగ్‌తో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని టీం తెలిపింది. మున్ముందు మరిన్ని అప్డేట్‌లతో మేకర్స్ అంచనాలు పెంచేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ తేజ్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, నరేష్, అజయ్ ఘోష్, సంపూర్ణేష్ బాబు, మురళీధర్ గౌడ్, అప్పు, కరణ్, జబర్దస్త్ సత్య శ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆనంద్ రాజవిక్రమ్ సంగీతం అందిస్తున్నారు.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana
Jul 13, 2026 10:37 AM IST














