Last Updated:
కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన తాజా చిత్రం ‘పురుష:’. ఈ రోజే (మే 22) విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన తాజా చిత్రం ‘పురుష:’. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. దర్శకుడు వీరు వులవల తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సప్తగిరి, కసిరెడ్డి రాజ్‌కుమార్, వెన్నెల కిషోర్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ ముఖ్య పాత్రల్లో నటించారు. మే 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం.
గోవింద్ (పవన్ కళ్యాణ్), శ్రీను (కసిరెడ్డి), సత్తి (సప్తగిరి) చిన్నప్పటి నుంచీ మంచి స్నేహితులు. వీరితో పాటు క్రియేటివ్ కిస్సు అలియాస్ కిషోర్ (వెన్నెల కిషోర్) కూడా వారి బాల్య మిత్రుడే. అయితే పెళ్లైన కొద్ది కాలానికే ఈ ముగ్గురు తమ భార్యలు పెట్టిన కేసుతో కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. గోవింద్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న కమల (రాయంచ), శ్రీను సమస్యలను తెలుసుకుని కూడా జీవితంలోకి వచ్చిన గీత (విషిక), భర్త ఆర్థికంగా కూలిపోయినా అతడిని వదలని లక్ష్మీ (హాసిని సుధీర్) ఎందుకు విడాకులు కోరుకుంటారు? ఈ ముగ్గురు జంటల మధ్య వచ్చిన విభేదాలకు అసలు కారణం ఏమిటి? వీరి జీవితాల్లో క్రియేటివ్ కిస్సు పాత్ర ఏంటి? చివరికి ఈ జంటలు మళ్లీ ఒక్కటయ్యాయా లేదా? అనేదే సినిమా కథ.
భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు, అపార్థాలు, భావోద్వేగాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ‘పురుష:’ ఒక ఫ్యామిలీ ఎమోషనల్ కామెడీగా నిలుస్తుంది. దర్శకుడు కథను సింపుల్‌గా తీసుకున్నప్పటికీ, దానికి వినోదాన్ని జోడించిన తీరు ఆకట్టుకుంటుంది. ఫస్టాఫ్ లో మూడు జంటల జీవితాలను పరిచయం చేసిన తీరు బాగుంటుంది. కోర్టు నేపథ్యంలో జరిగే సన్నివేశాలు, ఒక్కో జంట ఫ్లాష్‌బ్యాక్‌ను నెమ్మదిగా ఓపెన్ చేస్తూ కథను ముందుకు తీసుకెళ్లడం ఆసక్తికర అంశం. ముఖ్యంగా ప్రీ-ఇంటర్వెల్ లో వచ్చే కామెడీ ఎపిసోడ్ థియేటర్లలో మంచి నవ్వులు పంచుతుంది. ఇంటర్వెల్ ముందు, ఆ తర్వాత వెన్నెల కిషోర్ ట్రాక్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అనే చెప్పుకోవాలి.
సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు కాస్త రొటీన్‌గా అనిపించినా, హౌస్ హజ్బెండ్ కాన్సెప్ట్ చుట్టూ వచ్చే ఎపిసోడ్స్ ఆకట్టుకున్నాయి. ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్, చివర్లో భార్యాభర్తల బంధంపై చెప్పిన సందేశం ప్రేక్షకులను ఎమోషనల్‌గా కనెక్ట్ చేస్తుంది.
హీరో పవన్ కళ్యాణ్ బత్తుల తొలి సినిమానే అయినప్పటికీ పర్వాలేదనిపించారు. భావోద్వేగ సన్నివేశాల్లో మెప్పించే ప్రయత్నం చేశారు. డ్యాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఓకే అనిపిస్తాయి. అయితే నటనలో ఇంకా మెరుగుపడాల్సిన అవసరం కనిపిస్తుంది. సప్తగిరి, కసిరెడ్డి తమ కామెడీ టైమింగ్‌తో సినిమాను నిలబెట్టారు. వెన్నెల కిషోర్ ఎపిసోడ్ అయితే ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధిలో మెప్పించారు. సినిమా విజువల్స్ బాగున్నాయి. సంగీతం కథకు తగ్గట్టుగా ఉంది. పాటలు తెరపై అందంగా కనిపిస్తాయి. నిర్మాత నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడలేదనిపిస్తుంది. డైలాగ్స్‌లో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు కామెడీ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి.
ఫస్టాఫ్
కామెడీ ట్రాక్
కథలో డెప్త్ లేకపోవడం
అక్కడక్కడా పేలవమైన సీన్స్
ఫైనల్‌గా చెప్పాలంటే.. ‘పురుష:’ కొత్త కథ కాకపోయినా, ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, రిలేషన్‌షిప్ డ్రామాతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఈ సినిమా మంచి టైంపాస్ ఎంటర్‌టైనర్.
రేటింగ్: 2.75
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













