తీవ్ర వాయుగుండం తీరం దాటినప్పటికీ ఏపీపై వర్షాల తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. తీర ప్రాంతాలతో పాటు ఉమ్మడి జిల్లాల పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాల్లోనూ వరుణుడి బీభత్సం ఏకధాటిగా కొనసాగుతూనే ఉంది. దీంతో అప్రమత్తమైన ఇతర జిల్లాల కలెక్టర్లు సైతం ముందస్తు రక్షణ చర్యలు ముమ్మరం చేశారు. విద్యార్థుల ప్రాణ రక్షణే ఏకైక ధ్యేయంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, అల్లూరి సీతారామరాజు, పోలవరం, ఏలూరు జిల్లాల విద్యాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా జిల్లాల్లోని అన్ని స్కూళ్లకు సైతం నేడు సెలవు ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.














