Shoaib Akhtar: షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియలు.. హాజరయిన పహల్గాం మాస్టర్ మైండ్! | | ACTPnews

షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియలకు హాజరైన తీవ్రవాదులు


Last Updated:

ఈ దృశ్యాలలో పీఎమ్‌ఎమ్‌ఎల్ ఇస్లామాబాద్ చీఫ్ ఇనామ్-ఉర్-రెహ్మాన్ కాంబో, డిప్యూటీ జనరల్ సెక్రటరీ అబ్దుల్లా టూర్, జోనల్ జనరల్ సెక్రటరీ హఫీజ్ ఉమర్, ఖిద్మత్ కమిటీ చైర్మన్ అమ్జద్ భట్టి వంటి వారు స్పష్టంగా కనిపించారు.

షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియలకు హాజరైన తీవ్రవాదులు
షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియలకు హాజరైన తీవ్రవాదులు

Shoaib Akhtar: పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కుటుంబంలో జరిగిన ఒక విషాదం ఇప్పుడు రాజకీయంగా, అంతర్జాతీయంగా పెద్ద వివాదానికి దారితీసింది. షోయబ్ అక్తర్ పెద్ద సోదరుడి అంత్యక్రియలకు నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘లష్కరే తోయిబా’ (LeT) రాజకీయ విభాగంతో సంబంధం ఉన్న పలువురు కీలక నేతలు హాజరుకావడం తీవ్ర కలకలం రేపుతోంది.

అంత్యక్రియల్లో కనిపించిన ప్రముఖులు

పాకిస్థాన్ మీడియా నివేదికల ప్రకారం, షోయబ్ అక్తర్ అన్నయ్య షాహిద్ అక్తర్ మూడు రోజుల క్రితం గుండెపోటుతో (కార్డియాక్ అరెస్ట్) మరణించారు. ఆయన అంత్యక్రియల ప్రార్థనలకు (నమాజ్-ఎ-జనాజా) సంబంధించిన ఫోటోలు, వీడియోలను ‘పాకిస్థాన్ మర్కజీ ముస్లిం లీగ్’ (PMML) సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ దృశ్యాలలో పీఎమ్‌ఎమ్‌ఎల్ ఇస్లామాబాద్ చీఫ్ ఇనామ్-ఉర్-రెహ్మాన్ కాంబో, డిప్యూటీ జనరల్ సెక్రటరీ అబ్దుల్లా టూర్, జోనల్ జనరల్ సెక్రటరీ హఫీజ్ ఉమర్, ఖిద్మత్ కమిటీ చైర్మన్ అమ్జద్ భట్టి వంటి వారు స్పష్టంగా కనిపించారు.

అంతేకాకుండా లష్కరే డిప్యూటీ చీఫ్, పహల్గాం మాస్టర్ మైండ్ సైఫుల్లా కసూరి కూడా ఉన్నట్లు సమాచారం. ఇంకా ముంబై 26/11 ఉగ్రదాడుల మాస్టర్‌మైండ్, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌కు అత్యంత సన్నిహితులుగా భావించే కొందరు వ్యక్తులు కూడా ఈ అంత్యక్రియల ప్రార్థనల్లో వరుసల్లో నిలబడి పాల్గొన్నట్లు ఈ ఫుటేజ్ ద్వారా వెల్లడవుతోంది.

సోదరుడి మరణాన్ని ప్రకటించిన అక్తర్

తమ కుటుంబంలో జరిగిన ఈ నష్టాన్ని ధృవీకరిస్తూ షోయబ్ అక్తర్ గతంలో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. “నా ప్రియమైన పెద్దన్నయ్య షాహిద్ అక్తర్ అల్లా సముఖానికి చేరుకున్నారని చెప్పడానికి నేను ఎంతగానో విచారిస్తున్నాను. నమాజ్-ఎ-జనాజా సమయం, స్థలం వివరాలను రేపు ఉదయం తెలియజేస్తాను” అని ఆయన రాసుకొచ్చారు. అయితే, అంత్యక్రియల్లో పీఎమ్‌ఎమ్‌ఎల్ (PMML) మరియు లష్కరే అనుబంధ నేతల ఉనికిపై వస్తున్న విమర్శలపై మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఇప్పటివరకు బహిరంగంగా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.

పాకిస్థాన్‌లో ఎంతో ప్రజాదరణ ఉన్న ఒక సెలబ్రిటీ కుటుంబానికి సంబంధించిన వేడుకలో లేదా సభలో ఇలాంటి నిషేధిత గ్రూపుల ప్రతినిధులు బహిరంగంగా తిరగడం, హాజరుకావడం అంతర్జాతీయ సమాజంలో పాకిస్థాన్ ఉగ్రవాద రికార్డును మరోసారి తెరపైకి తెచ్చింది. నిషేధిత సంస్థలకు చెందిన వ్యక్తులు పాక్‌లో ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నారో చెప్పడానికి ఇది నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు.

పాకిస్థాన్ తన భూభాగం నుండి ఉగ్రవాద నెట్‌వర్క్‌లు, వాటి నాయకులు యథేచ్ఛగా కార్యకలాపాలు సాగించడానికి అనుమతిస్తోందని భారత్ చాలా ఏళ్లుగా ఆరోపిస్తూనే ఉంది. ఇలాంటి ఉగ్ర సంస్థలపై ఇస్లామాబాద్ కఠినమైన చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ వేదికలపై భారతదేశం పదేపదే డిమాండ్ చేస్తోంది.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports