Hardik Pandya: హార్దిక్ పాండ్యా సీక్రెట్ మ్యారేజ్? ఆమెతో పెళ్లి జరిగినట్లు సోషల్ మీడియాలో చర్చ.. కారణం ఈ ఫోటోనే! | క్రీడా వార్తలు | ACTPnews

హార్దిక్ పాండ్యా, మహికా శర్మ


Last Updated:

Hardik Pandya: భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన గర్ల్‌ఫ్రెండ్, ప్రముఖ మోడల్ మహికా శర్మను రహస్యంగా పెళ్లాడాడా? అంటే అవుననే అంటున్నాయి.

హార్దిక్ పాండ్యా, మహికా శర్మ
హార్దిక్ పాండ్యా, మహికా శర్మ

Hardik Pandya: భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన గర్ల్‌ఫ్రెండ్, ప్రముఖ మోడల్ మహికా శర్మను రహస్యంగా పెళ్లాడాడా? అంటే అవుననే అంటున్నాయి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సరికొత్త ఫోటోలు. వీరిద్దరూ సీక్రెట్‌గా వివాహం చేసుకున్నారంటూ నెట్టింట పెద్ద ఎత్తున ఊహాగానాలు మొదలయ్యాయి. హార్దిక్, మహికా ఇద్దరూ ఒక వృద్ధురాలితో కలిసి దిగిన ఫోటో ఆన్‌లైన్‌లోకి రావడంతో ఈ రూమర్లు ఒక్కసారిగా ఊపందుకున్నాయి.

సింధూరంతో దర్శనమిచ్చిన మహికా!

వైరల్ అవుతున్న ఆ ఫోటోను నిశితంగా గమనించిన నెటిజన్లు ఒక ఆసక్తికరమైన విషయాన్ని కనిపెట్టారు. హార్దిక్ పాండ్యాతో కలిసి ఫోటోకు పోజులిచ్చిన మహికా శర్మ నుదుటిపై ‘సింధూరం’ ధరించి ఉండటం అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా, ఆ ఫోటోలో ఉన్న వృద్ధురాలు ఈ జంట చేతులను పట్టుకుని ఆశీర్వదిస్తున్నట్లుగా ఉంది. దీంతో, వీరిద్దరూ అత్యంత సన్నిహితుల మధ్య ఒక ప్రైవేట్ వేడుకలో పెళ్లి బంధంతో ఒకటయ్యారని, ఆ తర్వాతే ఈ ఫోటో దిగారని సోషల్ మీడియాలో చాలా మంది బలంగా నమ్ముతున్నారు.

ఈ పెళ్లి వార్తలపై హార్దిక్ లేదా మహికా నుండి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ, వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట, ఇప్పుడు తమ బంధాన్ని తదుపరి దశకు తీసుకెళ్లి జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారని అభిమానులు ఫిక్స్ అయిపోతున్నారు.

రిలేషన్‌షిప్‌ను హార్దిక్ అఫీషియల్ చేసింది ఎప్పుడు?

తన మాజీ భార్య నటాషా స్టాన్‌కోవిచ్‌తో విడిపోయిన రెండేళ్ల తర్వాత.. హార్దిక్ పాండ్యా తన జీవితంలోకి వచ్చిన కొత్త మహిళగా మోడల్ మహికా శర్మను ప్రపంచానికి పరిచయం చేశాడు.

గతేడాది (2025) అక్టోబర్ 10న, హార్దిక్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో మహికాతో కలిసి బీచ్‌లో దిగిన ఒక ఫోటోను షేర్ చేశాడు. ఆ ఫోటోలో వీరిద్దరూ సముద్రతీరంలో ఎంతో ప్రశాంతంగా, సంతోషంగా కనిపించారు. హార్దిక్ ఓవర్‌సైజ్డ్ జాకెట్, షార్ట్స్ ధరించి మహికా భుజంపై చేయి వేయగా.. తెల్లటి షర్ట్ డ్రెస్‌లో ఉన్న మహికా కెమెరాకు దూరంగా చూస్తూ ఉంది. ఈ ఫోటోకు మహికా ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను ట్యాగ్ చేయడం ద్వారా హార్దిక్ తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించాడు. అప్పట్లోనే ఈ జంట కెమిస్ట్రీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఎవరీ మహికా శర్మ?

హార్దిక్ పాండ్యా కంటే ఏడేళ్లు చిన్నదైన మహికా శర్మ.. భారత ఫ్యాషన్ రంగంలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న మోడల్. ఆమె ‘ELLE’, ‘Grazia’ వంటి టాప్ మేగజైన్‌ల కవర్ పేజీలపై మెరిసింది. అంతేకాకుండా, ప్రతిష్టాత్మక ‘ఇండియన్ ఫ్యాషన్ అవార్డ్స్’లో ‘మోడల్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును కూడా సొంతం చేసుకుంది.

తనీష్క్ (Tanishq), వివో (Vivo), యునిక్లో (Uniqlo) వంటి ప్రముఖ బ్రాండ్ల యాడ్స్‌లో నటించిన మహికా.. తరుణ్ తహిలియాని, మనీష్ మల్హోత్రా, అనితా డోంగ్రే వంటి టాప్ డిజైనర్లు రూపొందించిన దుస్తులలో ఫ్యాషన్ షోలలో తరచూ సందడి చేస్తుంటుంది. మరి ఈ పెళ్లి రూమర్లపై హార్దిక్ పాండ్యా ఎలా స్పందిస్తాడో చూడాలి!

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports