Last Updated:
Shocking Moments: క్రీడా మైదానాల్లో ఆటగాళ్లు గుండెపోటుకు గురవడం, అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోవడం, లేదా గాయాలతో , ఆయాసంతో సొమ్మసిల్లి పడిపోయిన సంఘటనలు లెక్కలేనన్ని ఉన్నాయి.
Shocking Moments: ప్రపంచంలో అత్యధిక జనాభాను ఆహ్లాదపరిచేది, ఉత్తేజ పరిచేవి క్రీడలు మాత్రమే. సినిమాలు వినోదం కోసమైతే.. క్రీడలు ప్రతీ ఒక్కరిలో హుషారును నింపడానికి వాళ్లలోని పట్టుదలను పెంచడానికి దోహదపడుతూ ఉంటాయి. అందుకే ప్రపంచంలో ఏ క్రీడ జరుగుతున్న చూసే అభిమానుల సంఖ్య వేలల్లో , లక్షల్లో ఉంటుంది. అందుకే మైదానంలో పోటీ పడే ఆటగాళ్లు ప్రత్యర్థులపై పైచేయి సాధించడానికి తమ శక్తినంతా కూడగట్టుకొని ప్రతిభను ప్రదర్శిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో మైదానాల్లో విషాధ సంఘటనలు కూడా చోటుకున్న పరిస్థితులు ఉన్నాయి. తాజాగా ఫీఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం ఉక్రెయిన్‌తో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో ఇలాంటి సంఘటనే చోటుచేసుకోవడంతో మ్యాచ్ రద్దైంది. డెన్మార్క్, ఉక్రెయిన్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో డెన్మార్క్ 2-1 ఆధిక్యంలో ఉన్న సమయంలో.. ఆట 79వ నిమిషానికి చేరుకోగానే 34 ఏళ్ల మిడ్‌ఫీల్డర్ క్రిస్టియన్ ఎరిక్సన్ ఒక్కసారిగా తన ఛాతీని పట్టుకుని మైదానంలో పడిపోయాడు. ఇది గమనించిన తోటి ఆటగాళ్లు, మ్యాచ్ అధికారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే మెడికల్ సిబ్బంది మైదానంలోకి దూసుకెళ్లి అతనికి అత్యవసర చికిత్స అందించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి స్థిరంగానే ఉందని డెన్మార్క్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇప్పుడేల కాదు ఐదేళ్ల క్రితం కూడా ఎరిక్సన్ ఇలా మైదానంలో కుప్పకూలిపోయాడు. 2021 జూన్‌లో యూరో కప్‌లో ఫిన్లాండ్‌తో మ్యాచ్ ఆడుతుండగా ఎరిక్సన్‌కు గుండెపోటు (కార్డియాక్ అరెస్ట్) వచ్చింది. అప్పట్లో వైద్యులు మైదానంలోనే సీపీఆర్ చేసి అతడి ప్రాణాలు కాపాడారు.
క్రీడా మైదానాల్లో ఆటగాళ్లు గుండెపోటుకు గురవడం, అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోవడం, లేదా గాయాలతో , ఆయాసంతో సొమ్మసిల్లి పడిపోయిన సంఘటనలు లెక్కలేనన్ని ఉన్నాయి. తీవ్రమైన శారీరక శ్రమ, గుండె సంబంధిత సమస్యలు లేదా మైదానంలో తగిలిన గాయాల వల్ల ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఒక్కసారి గతంలోకి వెళ్లి చూసుకుంటే ఈవిధంగా మైదానంలోనే అస్వస్థతకు గురైన ప్రపంచ స్థాయి క్రీడాకారులు అరడజనుకుపైగానే ఉన్నారు.
మైదానంలోనే కుప్పకూలిన అంతర్జాతీయ ఆటగాళ్లు వీళ్లే:
ఆదివారం ఫీఫా ఫుట్ బాల్ కప్ టోర్నీలో గుండెపోటుకు గురైన ఆటగాడే క్రిస్టియన్ ఎరిక్సన్ యూరో 2020 (2021లో జరిగింది) టోర్నమెంట్‌లో ఫిన్లాండ్‌తో మ్యాచ్ జరుగుతుండగా డెన్మార్క్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియన్ ఎరిక్సన్ మైదానంలోనే అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. అతనికి గుండెపోటు వచ్చిందని గుర్తించిన డాక్టర్స్ వెంటనే గ్రౌండ్లోనే సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. క్రీడారంగంలో ఈ వార్త అత్యంత సంచలనం సృష్టించింది.

ఇలాంటి సంఘటనే మూడేళ్ల క్రితం అంటే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (EPL) 2023 డిసెంబర్‌లో బోర్న్‌మౌత్‌తో మ్యాచ్ జరుగుతుండగా లుటన్ టౌన్ కెప్టెన్ టామ్ లాక్యర్ మైదానంలోనే స్పృహ తప్పి పడిపోయాడు. అతని గుండె దాదాపు 2 నిమిషాల 40 సెకన్ల పాటు ఆగిపోయింది. మెడికల్ టీమ్ సకాలంలో స్పందించి డిఫిబ్రిలేటర్ ఉపయోగించి అతనికి ప్రాణం పోశారు.


అత్యధిక క్రీడాభిమానులను బాధపెట్టే సంఘటన ఇది. క్రికెట్ చరిత్రలో అత్యంత విషాదకరమైన సంఘటన 2014 నవంబర్‌లో సిడ్నీలో జరిగిన ఒక డొమెస్టిక్ మ్యాచ్‌లో బౌలర్ వేసిన బౌన్సర్ బంతి బ్యాట్స్‌మెన్ ఫిల్ హ్యూస్ మెడ వెనుక భాగానికి బలంగా తగిలింది. బంతి తగిలిన కొన్ని సెకన్లకే అతను గ్రౌంట్లో స్పృహ తప్పి పడిపోయాడు. మెదడుకు రక్తాన్ని తీసుకెళ్లే ధమని దెబ్బతినడంతో అతను కోమాలోకి వెళ్లి, రెండు రోజుల తర్వాత ఆసుపత్రిలో కన్నుమూశాడు.

స్పెయిన్ పురాణ గోల్‌కీపర్ ఇకెర్ కాసిల్లాస్‌కు 2019లో ఎఫ్‌సి పోర్టో తరఫున ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంటుండగా మైదానంలోనే తీవ్రమైన గుండెపోటు వచ్చింది. వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.

2003 ఫిఫా కాన్ఫెడరేషన్స్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ ఆడుతుండగా కెమరూన్ ఆటగాడు మాలీ వివియన్ ఫో మైదానం మధ్యలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ హైపర్‌ట్రోఫిక్ కార్డియోమయోపతి (గుండె కండరాలు లావుగా మారే సమస్య) కారణంగా అతను మైదానంలోనే చనిపోయిన సంఘటన ఇప్పటికి ఫుట్ బాల్ లవర్స్ మర్చిపోలేరు.

అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ , కాలేజ్ లీగ్స్‌లో కూడా ఆటగాళ్లు లైవ్ మ్యాచ్‌లోనే గుండెపోటుతో స్పృహ తప్పి పడిపోయిన సంఘటనలు ఉన్నాయి.
ఇలాంటి సంఘటనల తర్వాతే అంతర్జాతీయ క్రీడా సంస్థలు మైదానాల్లో అత్యవసర వైద్య సదుపాయాలను, ప్రత్యేకంగా డెఫిబ్రిలేటర్ పరికరాలను తప్పనిసరి చేశాయి.
ఏ ఆట అయినా క్రీడాకారులు కోట్లాది అభిమానుల్ని రంజింపచేయడానికి, వారి దేశ కీర్తిని ప్రపంచ స్థాయిలో పెంచుకోవడానికి క్రీడాకారులు మైదానంలో ప్రాణాల్ని పణంగా పెట్టి ఆటలాడుతూ ఉంటారు. అలాంటి సమయంలో ఇలాంటి కొన్ని విషాధకరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇది కాస్త బాధించే సందర్భమే అయినప్పటికి .. వాళ్ల క్రీడాస్పూర్తికి నిదర్శనంగా చూడా అభిమానులు చూస్తుంటారు.
లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana
Jun 08, 2026 11:18 AM IST













