ప్రాణరక్షక మందుల తయారీలో దేశవ్యాప్తంగా పేరొందిన తెలంగాణ సంస్థ ‘విన్స్ బయోప్రొడక్ట్స్ లిమిటెడ్’ ఈ విశేషమైన కాంట్రాక్టును దక్కించుకుంది. టెటానస్, డిఫ్తీరియా, గ్యాంగ్రీన్ లాంటి ప్రాణాంతక వ్యాధులకు విరుగుడు మందులను తయారు చేయడంలో వీరు నిష్ణాతులు. ఈ ఫార్మా కంపెనీకి గుజరాత్ అటవీ పరిశోధన ఫౌండేషన్ (జిఎఫ్ఆర్ఎఫ్) ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఎస్ఆర్ఐ తాజాగా విషాన్ని అప్పగించింది. ఇందులో 33.37 గ్రాముల ఇండియన్ నాగుపాము విషం, 2.67 గ్రాముల కట్లపాము (కామన్ క్రైట్) విషం, 30.82 గ్రాముల రక్త పింజరి (రస్సెల్స్ వైపర్) విషం, 1.71 గ్రాముల సా-స్కేల్డ్ వైపర్ విషం భద్రంగా ఉన్నాయి.













