Last Updated:
Sourav Ganguly: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి తీవ్ర ప్రాణహాని బెదిరింపులు వచ్చాయి.
అతడిని, భార్య డోనా గంగూలీని దారుణంగా హత్య చేస్తామంటూ వరుసగా బెదిరింపు లేఖలు రావడంతో దాదా పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొన్ని నెలలుగా ఈ లేఖలు వస్తున్నా తాజాగా వీటి తీవ్రత పెరిగింది. దాంతో గంగూలీ మేనేజర్, బెంగాల్ క్రికెట్ సంఘం (CAB) కోల్‌కతా పోలీసులను ఆశ్రయించాయి. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దాదాపు గత ఆరు నెలలుగా సౌరవ్ గంగూలీ పేరు మీద ఇటువంటి బెదిరింపు లేఖలు వస్తున్నాయి. అయితే, తొలినాళ్లలో వీటిని అభిమానులు లేదా ఎవరైనా ఆకతాయిలు పంపిన లేఖలుగా భావించి గంగూలీ బృందం పెద్దగా పట్టించుకోలేదు.














