Last Updated:
హాలీవుడ్ సూపర్ హీరో సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ మరోసారి రుజువైంది. టామ్ హాలెండ్, జెండయా ప్రధాన పాత్రల్లో నటించిన ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ రిలీజైన ఫస్ట్ వీకెండ్లోనే బాక్సాఫీస్ దగ్గర కనక వర్షం కురిపిస్తుంది.
హాలీవుడ్ సూపర్ హీరో సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ మరోసారి రుజువైంది. టామ్ హాలెండ్, జెండయా ప్రధాన పాత్రల్లో నటించిన ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ రిలీజైన ఫస్ట్ వీకెండ్లోనే బాక్సాఫీస్ దగ్గర కనక వర్షం కురిపిస్తుంది. పేయిడ్ ప్రీమియర్లతో జూలై 29న రిలీజైన ఈ సినిమా బీభత్సమైన వసూళ్లు సాధిస్తూ.. ఇండియన్ బాక్సాఫీస్‌పై విరుచుకపడుతుంది. ఏ సెంటర్, బీ సెంటర్ అని తేడా లేకుండా ప్రతీ చోట బీభత్సం సృష్టిస్తుంది. అసలు స్పైడర్ మ్యాన్ ఫీవర్ ఏ రేంజ్లో ఉందంటే.. కేవలం 4 రోజుల్లోనే ఇండియాలో రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ఊచకోత రికార్డులు సృష్టిస్తుంది.
తాజా వివరాల ప్రకారం, ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 927 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.8,830 కోట్లు) వసూలు చేసింది. దీంతో ప్రపంచ సినిమా చరిత్రలోనే రెండో అతిపెద్ద గ్లోబల్ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ జాబితాలో ఇప్పటికీ ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ మొదటి స్థానంలో కొనసాగుతోంది. 2019లో విడుదలైన ఆ చిత్రం తొలి దశలోనే 1.2 బిలియన్ డాలర్లు (సుమారు రూ.11 వేల కోట్లు) వసూలు చేసి ఇప్పటికీ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.
సుమారు 225 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.2,100 కోట్లు) భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ విడుదలైన మొదటి వీకెండ్లోనే తన నిర్మాణ వ్యయాన్ని దాటేయడం విశేషం. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, విజువల్ ఎఫెక్ట్స్, భావోద్వేగాలతో కూడిన కథ, టామ్ హాలెండ్ నటన ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో 38వ చిత్రంగా వచ్చిన ఈ సినిమా భారత్‌లోనూ అద్భుతమైన ప్రదర్శన కొనసాగిస్తోంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే రూ.310 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు చిత్ర బృందం వెల్లడించింది. తెలుగు, హిందీ, తమిళం సహా పలు భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి భారతీయ ప్రేక్షకుల నుంచి కూడా విశేష ఆదరణ లభిస్తోంది.
ఈ ఏడాది డిసెంబర్లో విడుదల కానున్న మార్వెల్ స్టూడియోస్ ప్రతిష్ఠాత్మక చిత్రం ‘అవెంజర్స్: డూమ్స్‌డే’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాంటి సమయంలో ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోవడంతో మార్వెల్ అభిమానుల్లో మరింత ఉత్సాహం పెరిగింది. ప్రస్తుతం వస్తున్న ట్రెండ్‌ను బట్టి చూస్తే, ఈ సినిమా త్వరలోనే 1 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మార్వెల్‌కు మరో భారీ విజయాన్ని అందించిన చిత్రంగా ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ఇప్పటికే తన ముద్ర వేసింది.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














