Srihari Son: రియల్ స్టార్ శ్రీహరి కొడుకు హీరోగా స్టూడెంట్ మూవీ.. పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

స్వర్గీయ రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “స్టూడెంట్”. ఈ సినిమాలో విజేత పరీక్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

News18
News18

స్వర్గీయ రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “స్టూడెంట్”. ఈ సినిమాలో విజేత పరీక్ హీరోయిన్ గా నటిస్తోంది. జోవికా సినిమాస్, చెరిష్ మీడియా వర్క్స్ బ్యానర్స్ పై బెల్లం సిద్ధారెడ్డి నిర్మిస్తున్నారు. బాలు తత్వమసి దర్శకత్వం వహిస్తున్నారు. బెల్లం సంగీత, బెల్లం బయ్యారెడ్డి కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు.

ఈ రోజు “స్టూడెంట్” సినిమా నుంచి పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో మేఘాంశ్ శ్రీహరి ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నారు. పవర్ స్టార్ సినిమాకు బ్యానర్స్ కట్టడం, జామెట్రీ బాక్స్ లోని డివైడర్ ను క్లాస్ లో కాకుండా ఫైట్స్ కు ఉపయోగించడం, కాల్చిన సిగరెట్, అందంగా లవ్ లెటర్స్ రాయడం..ఇలా స్టూడెంట్ లో లైఫ్ లో భాగమైనవన్నీ ఈ పోస్టర్ లో కనిపించి ఆకట్టుకుంటున్నాయి. ‘ధైర్యం ఉన్నవాడే తన వెంట అందరూ నడిచేలా చేసుకుంటాడు’ అని రాసిన కొటేషన్ హీరో డేరింగ్ క్యారెక్టర్ ను రిఫ్లెక్ట్ చేస్తుండగా.. ‘ఈ భాను గాడు అంతా చూసుకుంటాడు, నువ్వు లవ్ చేయి, తన్మయ్ లవ్స్ భాను..’ అని రాసిన మాటలు ఈ స్టూడెంట్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ డ్రామాలో ఉన్న పవర్ ఫుల్ లవ్ స్టోరీని చూపిస్తున్నాయి.

“స్టూడెంట్” సినిమా మేఘాంశ్ శ్రీహరి కెరీర్ కు ల్యాండ్ మార్క్ మూవీగా రాబోతుందనే అంచనాలు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఏర్పడుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *