SS Rajamouli: వారణాసి తర్వాత రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటో తెలుసా? స్టార్ హీరోతో జక్కన్న క్రేజీ ప్లాన్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న వారణాసి తర్వాత రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? అనే దానిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఆ వివరాలు చూస్తే..

News18
News18

దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తదుపరి ప్రాజెక్ట్‌పై టాలీవుడ్ సహా యావత్ భారతీయ చిత్రసీమలో ఆసక్తికర చర్చ మొదలైంది. సాధారణంగా ఒక సినిమా సెట్స్‌పై ఉండగా మరో కథ గురించి మాట్లాడని జక్కన్న, ‘ఆర్ఆర్ఆర్’ గ్లోబల్ సక్సెస్ అనంతరం భవిష్యత్ ఆలోచనలపై సందర్భానుసారంగా కీలక సంకేతాలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక గ్లోబ్-ట్రాటింగ్ అడ్వెంచర్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ చిత్రీకరణలో పూర్తి నిమగ్నమై ఉన్నారు.

హాలీవుడ్ ప్రమాణాలతో భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ చిత్రం రాజమౌళి కెరీర్‌లోనే అత్యంత వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజా ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. మహేష్ బాబుకు సంబంధించిన ప్రధాన యాక్షన్ ఎపిసోడ్లు, కీలక భాగాల చిత్రీకరణ ఇప్పటికే ముగిసింది. కేవలం కొన్ని ప్యాచ్ వర్క్ మినహా ప్రధాన షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకుంది. అయితే చిత్రీకరణ ముగిసినప్పటికీ సినిమా విడుదల కావడానికి సమయం పట్టే అవకాశం ఉంది. అత్యాధునిక వీఎఫ్ఎక్స్ (VFX) వర్క్స్, సుదీర్ఘమైన పోస్ట్ ప్రొడక్షన్ పనులు, అంతర్జాతీయ ప్రమోషన్ల కోసం రాజమౌళి మరో ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు ఈ ప్రాజెక్ట్‌కే సమయం కేటాయించనున్నారు.

ఈ నేపథ్యంలో కోలీవుడ్ వెర్సటైల్ స్టార్ సూర్యతో రాజమౌళి తదుపరి చిత్రం ఉండబోతోందన్న ప్రచారం ఊపందుకుంది. ఇటీవల ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రమోషన్స్ సందర్భంగా సూర్యతో కలయికపై జక్కన్న స్పందిస్తూ.. తామిద్దరం కలిసి పనిచేస్తే అది కచ్చితంగా చాలా ప్రత్యేకమైన చిత్రమవుతుందని వ్యాఖ్యానించారు. ‘గజినీ’, ‘యముడు’ సిరీస్‌ల నుంచి ‘జై భీమ్’ వరకు తెలుగు ప్రేక్షకుల్లోనూ సూర్యకు తిరుగులేని మార్కెట్ ఉంది. అటు భావోద్వేగాలను పండించడంలో సూర్య నటనా ప్రతిభ, ఇటు రాజమౌళి విజన్ తోడైతే పాన్-వరల్డ్ స్థాయిలో మరో అద్భుతం ఆవిష్కృతమవుతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మహేష్ బాబు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయిన తర్వాతే ఈ ప్రాజెక్ట్‌పై పూర్తి స్పష్టత రానుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed