Sumanth: సుమంత్ ప్రధాన పాత్రలో మహేంద్రగిరి వారాహి.. అతి త్వరలో టీజర్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు, లక్ష్మణ్ నిర్మాతలుగా రాజశ్యామల ‌ఎంటర్టైన్మెంట్స్ & బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై తెరకెక్కుతున్న చిత్రం మహేంద్రగిరి వారాహి. అతి త్వరలో ఈ సినిమా టీజర్ రిలీజ్ కానుంది.

News18
News18

సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు, లక్ష్మణ్ నిర్మాతలుగా రాజశ్యామల ‌ఎంటర్టైన్మెంట్స్ & బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై తెరకెక్కుతున్న చిత్రం మహేంద్రగిరి వారాహి. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కధాంశాన్ని ఆధారంగా చేసుకుని దర్శకుడు సంతోష్ జాగర్లపూడి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సుమంత్ , మీనాక్షి గోసామి, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, కమల్ కామరాజు, సత్యసాయి శ్రీనివాస్, వంశీ చాగంటి, మంజు భార్గవి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

అయితే త్వరలో విడుదల కాబోతున్న ఈ టీజర్ పై సోషల్ మీడియాలో ఆసక్తి నెలకొంది, మహేంద్రగిరి వారాహి టీజర్ విజువల్ గా ఆకట్టుకుంటుంది, రిచ్ విజువల్స్, ప్రామిసింగ్ సీజి వర్క్ తో గ్రాండ్ గా ఈ టీజర్ ఉండబోతోందని, త్వరలో ప్రేక్షకులు మహేంద్రగిరి వారహి టీజర్ తో సరికొత్త అనుభూతిని పొందుతారని మేకర్స్ చెబుతున్న నేపథ్యంలో ఈ వీడియోపై ప్రతి ఒక్కరిలో ఆసక్తి పెరిగింది. సంతోష్ జాగర్లపూడి ఈ సినిమాను విజువల్ వండర్ గా రూపొందిస్తున్నారని, సుమంత్ కు తన కెరీర్ లో మహేంద్రగిరి వారాహి సినిమా ఒక మైలు రాయిగా నిలబోతోందని చిత్ర యూనిట్ చెబుతున్నారు.

సుమంత్ 1975 ఫిబ్రవరి 9 న హైదరాబాదులో జన్మించాడు. సుమంత్ తల్లి నటుడు అక్కినేని నాగేశ్వరరావు కుమార్తె. తండ్రి యార్లగడ్డ సురేంద్ర. సుమంత్ ఈ దంపతులకు ఒకడే సంతానం. అక్కినేని మనవలు, మనవరాళ్ళలో సుమంతే అందరికన్నా పెద్దవాడు. ఇతను పుట్టిన కొన్ని నెలల తర్వాత అతని తల్లిదండ్రులు అమెరికాకు వెళ్ళవలసి వచ్చింది. సుమంత్ మాత్రం తాత కోరిక మేరకు, అక్కినేని దంపతుల దగ్గర ఉండిపోయాడు.

సుమంత్ నట జీవితం 1999 సంవత్సరం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ప్రేమ కథ చిత్రంతో మొదలైంది. ఇదీ, అతని రెండవ చిత్రం, యువకుడు పర్వాలేదు అనిపించుకున్నాయి. ఇతను తర్వాత నటించిన సినిమాలు అంతగా ఆడలేదు. అయితే 2003 లో జెనీలియాతో నటించిన సత్యం తో చిత్రసీమలో స్థిరపడ్డాడు. ఆ తర్వాత గౌరి కూడా విజయం సాధించి అతనికి మాస్ ఇమేజ్ ఇచ్చింది. మళ్ళీ కొన్ని విఫలాలు తర్వాత, 2006 సంవత్సరం లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో గోదావరి సినిమాతో ఉన్నత స్థానానికి చేరాడు. ఆపై అడపాదడపా సినిమాలు చేస్తూ కెరీర్ కంటిన్యూ చేస్తున్నాడు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed