Last Updated:
గత శుక్రవారం రిలీజైన ‘వీరభద్రుడు’ సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో రివ్యూలు రాలేదు కానీ.. డీసెంట్ హిట్ అనే టాక్ మాత్రం తెచ్చుకుంది. ఈ సినిమాకు ఆరే.బాలాజీ దర్శకత్వం వహించాడు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది.
గత శుక్రవారం రిలీజైన ‘వీరభద్రుడు’ సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో రివ్యూలు రాలేదు కానీ.. డీసెంట్ హిట్ అనే టాక్ మాత్రం తెచ్చుకుంది. ఈ సినిమాకు ఆరే.బాలాజీ దర్శకత్వం వహించాడు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు లాస్ట్ గురువారం ఈ మూవీ రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకుంది.
అంతా సవ్యంగా జరుగుతుందనుకున్న టైమ్‌లో రిలీజ్ రోజున ఈ సినిమాకు అసలు చిక్కు ఎదురైంది. కొన్ని కారణాల వల్ల ఎక్కడ కూడా ఈ సినిమా షోలు పడలేదు. ఆలా గురువారం రిలీజ్ కావాల్సిన సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాములు ఆడియెన్స్ వన్ టైమ్ వాచ్ అని రివ్యూలు ఇచ్చినా.. ఫ్యాన్స్‌కు మాత్రం ఫుల్ మీల్స్‌లా అనిపించిందని చెబుతున్నారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించింది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మాత్రం విరుచుక పడుతుంది.
ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేలోపు ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ.150 కోట్ల మార్క్‌ను దాటేసింది. నాలుగు రోజుల్లో ఈ సినిమా ఏకంగా రూ.150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇండియా వైడ్‌గా ఈ సినిమా రూ.103 కోట్లు కలెక్ట్ చేయగా.. ఓవర్సీస్‌లో రూ.47 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. మొత్తంగా రూ.150 కోట్లు కలెక్ట్ చేసి సూర్య కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా రూ.70 కోట్ల రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు వచ్చిన షేర్ రూ.70 కోట్ల దాటేసింది. అంటే ఈ సినిమా కేవలం 4 రోజుల్లోనే క్లీన్ హిట్ స్టేటస్ దక్కించుకుంది.
దత్త పుత్రుడు అంటూ సూర్యను ముద్దుగా పిలిచుకునే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా సాలిడ్ కలెక్షన్లు రాబడుతుంది. దాదాపు రూ.7.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ సినిమా నాలుగ రోజులు పూర్తయ్యే సరికి రూ.7.6 కోట్ల వరకు షేర్ కలెక్షన్లు సాధించింది. అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా క్లీన్ హిట్ అయిపోయింది. ప్రస్తుతం ఈ సినిమాకున్న క్రేజ్‌కు రూ.200 కోట్లు ఈజీగా టచ్ చేస్తుంది..
ఈ సినిమా కథ విషయానికొస్తే.. హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వే స్టేషన్‌లో దొంగతనం జరిగిన తన నగలను రికవరీ చేసుకోవడానికి ఒక నిరుపేద తండ్రి పడే ఆరాటం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అవినీతిమయమైన న్యాయ వ్యవస్థ, స్వార్థపరుడైన లాయర్ బేబీ కృష్ణ (ఆర్జే బాలాజీ) వల్ల ఆ తండ్రికి అన్యాయం జరుగుతుంది. ఈ క్రమంలో నాంపల్లి క్షేత్రపాలకుడైన వీరభద్రుడు (సూర్య) స్వయంగా భూమిపైకి వచ్చి బాధితుడి తరపున ఎలా పోరాడారు? కోర్టులో దేవుడు చేసిన వాదనలేంటి? అన్నదే ఈ సినిమా కథ…
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














