Last Updated:
Suryakumar Yadav: భారత జట్టుకు టీ20 ప్రపంచకప్ అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (స్కై), టోర్నీ గెలిచిన వెంటనే తనను జాతీయ జట్టు నుంచి తప్పించడంపై ఎట్టకేలకు మౌనం వీడాడు.
అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ సూర్యను పక్కనపెట్టి, ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లకు శ్రేయస్ అయ్యర్‌ను కొత్త కెప్టెన్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. గత రెండేళ్లుగా సూర్యకుమార్ వ్యక్తిగత బ్యాటింగ్ ఫామ్ ఆశించిన స్థాయిలో లేకపోవడమే అతడిని జట్టు నుంచి తప్పించడానికి ప్రధాన కారణంగా నిలిచింది.














