Tamil Nadu Ammonia Gas Leak: తమిళనాడులో ఘోర విషాదం.. అమ్మోనియం గ్యాస్‌ లీకై ఏడుగురు మృతి | | ACTPnews

ప్రతీకాత్మక చిత్రం


Last Updated:

ఈ ప్రమాదం తమిళనాడులో పారిశ్రామిక సేఫ్టీపై మళ్లీ చర్చనీయాంశమైంది. గతంలో ఎన్నోర్, తూతుకుడి వంటి ప్రాంతాల్లో కూడా అమ్మోనియా లీక్ ఘటనలు జరిగాయి. కార్మికుల భద్రత, ఫ్యాక్టరీలలో రెగ్యులర్ ఆడిట్స్, శిక్షణ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

తమిళనాడు.. తిరువళ్లూరు జిల్లాలో అమ్మోనియం గ్యాస్ లీకైంది. ఒక రొయ్యల ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకవడంతో.. దాన్ని పీల్చి.. 60 మందికి పైగా ఆస్వస్థత చెందారు. వారిలో ఏడుగురు చనిపోగా.. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. వారికి ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. ప్రస్తుతం గ్యాస్ లీకేజీని ఆపారు. ఇద్దరిని అరెస్టు చేశారు. గ్యాస్ ఎందుకు లీకైందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మూడు రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని సీఎం విజయ్ ఆదేశించారు. బాధితుల్లో ఎక్కువ మంది మహిళలున్నారు.

తతిరువళ్లూరు జిల్లాలోని పెరియపాలయం సమీపంలోని మంజంగరణై (లేదా కన్నిగైపైర్) ప్రాంతంలో సెయింట్ పీటర్స్ పాల్ సీఫుడ్స్ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సీఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లో అమ్మోనియా గ్యాస్ లీక్ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళా కార్మికులు చికిత్స పొందుతూ మృతి చెందారని పోలీసులు, జిల్లా కలెక్టర్ తెలిపారు.

ఇవి కూడా చదవండి: Earth Minerals: మీ భూమిలో లంకెబిందెలు, ఖనిజాలు లభిస్తే, వాటిపై మీకు హక్కు ఉంటుందా? చట్టం ఏం చెబుతోంది?

జిల్లా కలెక్టర్ ఎస్. కవిత తెలిపిన వివరాల ప్రకారం, గ్యాస్ లీక్ తర్వాత మొత్తం 67 మంది కార్మికులు ప్రభావితమయ్యారు. వారందరినీ స్థానిక ఆసుపత్రులకు తరలించారు. వీరిలో 46 మంది వెల్స్ హాస్పిటల్‌లో, 21 మంది వెంకటేశ్వర హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. తీవ్ర స్థితిలో ఉన్న 9 మంది క్లిష్టమైన రోగులను అంబులెన్స్‌ల ద్వారా చెన్నైలోని గవర్నమెంట్ స్టాన్లీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌కు తరలించారు.

ఈ ఘటన ఫ్యాక్టరీ సెలవు రోజున జరిగింది. అమ్మోనియా గ్యాస్ లీక్ కారణంగా కార్మికులు స్పృహ కోల్పోయి పడిపోయారని, శ్వాస సమస్యలు, కళ్లలో మంట వంటి లక్షణాలు కనిపించాయని ప్రాథమిక నివేదికలు తెలిపాయి. స్థానిక పోలీసు, ఫైర్ సర్వీసెస్, హెల్త్, రెవెన్యూ బృందాలు స్పాట్‌కు చేరుకున్నాయి. అరక్కోణం నుంచి ఎన్‌డీఆర్‌ఎఫ్ సీబీఆర్‌ఎన్ బృందం స్పెషల్ గేర్‌తో వచ్చి ఫ్యాక్టరీని సురక్షితం చేసింది. లీక్‌ను నియంత్రించినట్లు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి: Rain: వాన పడే సమయంలో “అర్జున ఫల్గుణ” అని ఎందుకంటారు? 90 శాతం మందికి తెలియదు!

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఈ ఘటనపై వెంటనే స్పందించారు. ముగ్గురు సభ్యుల కమిటీని నియమించి సేఫ్టీ లోపాలను దర్యాప్తు చేయాలని ఆదేశించారు. బాధితుల సంరక్షణపై అధికారులను పర్యవేక్షించమని మంత్రులు అరుణ్‌రాజ్, ఆదవ్ అర్జున, ఇమ్రాన్ మోహన్‌లను ఆదేశించారు. కుటుంబాలు, గవర్నర్ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బాధితులు చాలా మంది అసోం, ఒడిశా, ఝార్ఖండ్ నుంచి వచ్చిన మైగ్రెంట్ వర్కర్లు అని నివేదికలు చెబుతున్నాయి. ఈ ఘటనపై 3 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని సీఎం ఆదేశించారు.

అమ్మోనియా గ్యాస్ అత్యంత విషపూరితమైనది. శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీసి, తీవ్ర సందర్భాల్లో మరణానికి దారితీస్తుంది. ఈ ఫ్యాక్టరీలో గతంలో కూడా సమానమైన ఘటనలు జరగడంతో సేఫ్టీ ప్రమాణాలు, ఎమర్జెన్సీ ప్రొటోకాల్స్ పాటించకపోవడం దర్యాప్తులో బయటపడవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఫ్యాక్టరీ ఆపరేషన్స్ సస్పెండ్ చేశారు. బాధిత కుటుంబాలకు తగిన పరిహారం, ఉపాధి సహాయం అందించాలని డిమాండ్లు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి: Real Dhurandhar: సినిమాలో ధురంధర్ కాదు.. రియల్ INA మొదటి మహిళా ధురంధర్ గురించి తెలుసుకోండి.. జై హింద్!

ఈ ప్రమాదం తమిళనాడులో పారిశ్రామిక సేఫ్టీపై మళ్లీ చర్చనీయాంశమైంది. గతంలో ఎన్నోర్, తూతుకుడి వంటి ప్రాంతాల్లో కూడా అమ్మోనియా లీక్ ఘటనలు జరిగాయి. కార్మికుల భద్రత, ఫ్యాక్టరీలలో రెగ్యులర్ ఆడిట్స్, శిక్షణ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. బాధితుల ఆరోగ్య పరిస్థితి పర్యవేక్షణలో ఉంది. ఈ ఘటన మానవ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కార్మికుల హక్కులు, పరిశ్రమల బాధ్యతలు గుర్తు చేస్తుంది.

ఈ సందేశం ఇప్పుడే వచ్చింది. మీరు News18 తెలుగు వెబ్‌సైట్ ద్వారా చాలా వేగంగా పొందవచ్చు మరియు చదవవచ్చు. మేము మరింత సమాచారం పొందినప్పుడు మేము ఈ పోస్ట్‌ను అప్‌డేట్ చేస్తాము. అన్ని వార్తలు మరియు అప్‌డేట్‌లను వెంటనే పొందడానికి మాతో కనెక్ట్ అయి ఉండండి. ముందుగా అన్ని వార్తలను పొందండి

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *