Last Updated:
Teachers day 2026: భారతదేశం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటుంది. ఈ సందర్భంగా దేశంలోని పాఠశాలలు, కళాశాలల్లో గురువుల గౌరవార్థం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
విద్యార్థులు తమ ఉపాధ్యాయుల కోసం సాంస్కృతిక ప్రదర్శనలు, ఆటల పోటీలు ఏర్పాటు చేసి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అనేక పాఠశాలల్లో సీనియర్ విద్యార్థులే స్వయంగా ఉపాధ్యాయుల పాత్రను పోషించి జూనియర్ తరగతులకు బోధిస్తుండగా, ఉపాధ్యాయులు తమ రోజువారీ తరగతి గది బాధ్యతల నుండి కాసేపు విశ్రాంతి తీసుకుని ఈ సంబరాల్లో పాలుపంచుకుంటున్నారు.














