Last Updated:
Team India: క్రికెట్ సలహా కమిటీ (CAC) పాత్రను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పునఃపరిశీలించాల్సిన సమయం వచ్చిందని దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు.
ఈ ప్యానెల్‌కు మరిన్ని విస్తృత అధికారాలు కల్పించాలని, భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత దిగ్గజ మాజీ క్రికెటర్ల అనుభవాన్ని దీని కోసం ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఇషాన్ కిషన్ నేతృత్వంలోని ఈస్ట్ జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం (First-innings lead) ఆధారంగా టైటిల్ గెలవడాన్ని గవాస్కర్ తీవ్రంగా తప్పుబట్టారు. గత కొన్నేళ్లుగా తీవ్ర విమర్శలకు గురవుతున్న ఈ నిబంధనపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. ఇలాంటి సాంకేతిక లోపాలను సరిదిద్దడానికి, భారత క్రికెట్ భవిష్యత్తును సరైన మార్గంలో నడిపించడానికి సీఏసీ మరింత క్రియాశీలక పాత్ర పోషించాలని స్పష్టం చేశారు.














