Last Updated:
Telangana Assembly Session: విదేశీ టూర్ ముగించుకొని వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అంశాలు, రాజకీయ పరిణామాలు, మరో రెండేళ్ల పదవికాలంలో చేపట్టాల్సిన అభివృద్ది పనులపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇక ఇందులో భాగంగానే తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
Telangana Assembly Session: విదేశీ టూర్ ముగించుకొని వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అంశాలు, రాజకీయ పరిణామాలు, మరో రెండేళ్ల పదవికాలంలో చేపట్టాల్సిన అభివృద్ది పనులపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇక ఇందులో భాగంగానే తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ, సామాజిక పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశాలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కాంగ్రెస్ గత పాలకుల వైఫల్యాలను ఎండగట్టాలని పక్కా ప్లాన్ రూపొందించుకుంటే.. విపక్షాలు కూడా అంతే ధీటుగా కాంగ్రెస్ ప్రభుత్వ లోటుపాటులను సమావేశాల్లో ప్రశ్నించాలని చూస్తోంది.














