Podarillu Serial June 17th Episode: కేశవ, చక్రిల గొడవతో విసిగిపోయిన మహాలక్ష్మి, నారాయణలను తిట్టగా… పెద్ది కూడా జోక్యం చేసుకుని ఇంకోసారి గొడవపడితే మహాను హాస్టల్లో జాయిన్ చేస్తానని వార్నింగ్ ఇస్తాడు. దాంతో తాగడానికి వెళ్లిన చక్రికి నారాయణ బుద్ధి చెప్పి పంపడంతో, వాడు వెనక్కి వచ్చి మహాలక్ష్మికి సారీ చెప్తాడు. ఇక రాత్రికి కేశవ, చక్రిలు పాత గొడవలు మర్చిపోయి కలిసిపోవడం చూసి పెద్ది, మహాలక్ష్మి మురిసిపోతారు. అటు శైలు కేశవకు మిస్డ్‌కాల్స్ ఇస్తూ ఆటపట్టిస్తుండగా, ఇటు ఉదయాన్నే కేశవను లేపిన చక్రి ఒక సెకండ్ హ్యాండ్ స్కూటీని చూసేందుకు వెళ్తాడు. చివరిగా, యజమానితో మాట్లాడి 25 వేలకు స్కూటీ డీల్ ఓకే చేసి, 10 వేల అడ్వాన్స్ ఇచ్చి మిగతా డబ్బులు కేశవ ఇప్పిస్తాడని చక్రి చెప్పడంతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.














