Thalapathy Vijay Son: నా ఫస్ట్ మూవీ ప్రమోషన్‌కి నాన్న దూరం.. అదే నాకు పెద్ద గిఫ్ట్ అంటూ సీఎం విజయ్ తనయుడు జాసన్ సంజయ్ కామెంట్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

Thalapathy Vijay Son Jason Sanjay


Last Updated:

Thalapathy Vijay Son:తమిళనాడు సీఎం విజయ్ తనయుడు జాసన్ సంజయ్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ సిగ్మా అక్టోబర్ 2న విడుదలవుతుంది. ఈసినిమా ప్రమోషనలో తండ్రి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు డైరెక్టర్ జాసన్ సంజయ్.

Thalapathy Vijay Son Jason Sanjay
Thalapathy Vijay Son Jason Sanjay

Thalapathy Vijay Son: ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల కొడుకులు కూడా అగ్ర నటులుగా మారుతారనేది ఓల్డ్ డైలాగ్. ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ మారింది. హీరోల కొడుకులు మెగాఫోన్ పట్టుకొని డైరెక్ట్ చేస్తామంటున్నారు. అంతే కాదు సౌత్‌లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోగా తమిళ చిత్రపరిశ్రమను ఓ ఊపు ఊపిన తమిళనాడు సీఎం దళపతి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ కూడా ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నారు. తండ్రిలా హీరోగా కాకుండా దర్శకుడిగా మారిపోయాడు. యాక్టర్ సందీప్ కిషన్, ఫరియా అబ్ధుల్లా లీడ్‌రోల్‌ పోషిస్తున్న సిగ్మా మూవీతో తమిళ సినీ పరిశ్రమలో డైరెక్టర్‌గా అరంగేట్రం చేస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్‌ ఆల్రెడీ బిగెన్ చేసిన దర్శకుడు జాసన్ సంజయ్ తన డెబ్యూ మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు హీరో విజయ్ కొడుకు చేసిన కామెంట్స్ అతనికి హీరోని మించిన, తండ్రితో సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ని తెచ్చి పెడుతున్నాయి. ఇక విజయ్ సన్ డైరెక్ట్ చేసిన సిగ్మా మూవీ ఈ ఏడాది అక్టోబర్ 2న విడుదల కానుంది.

మా నాన్న నా ఫస్ట్ మూవీ కోసం ఎదురుచూపు..

తమిళనటుడు విజయ్‌ దళపతికి సొంత భాషలో మాత్రమే కాదు టాలీవుడ్‌లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి స్టార్ హీరో కొడుకు జాసన్ సంజయ్‌ నటుడిగా కాకుండా డైరెక్టర్‌గా మారి సిగ్మా అనే సినిమా రూపొందించాడు. ఈ సినిమా ప్రమోషన్, ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. అయితే ఓ స్టార్ హీరో, ప్రస్తుతం తమిళనాడు సీఎంగా ఉన్న నాయకుడి కొడుకు జాసన్ సంజయ్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నప్పటికి తన తండ్రి నుంచి తనకు లభించిన అత్యంత గొప్ప బహుమతిగా తెలిపాడు.

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జాసన్ సంజయ్ కామెంట్..

హైదరాబాద్‌లో జాసన్ సంజయ్ ఫస్ట్ మూవీ సిగ్మా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ జరిగింది. సాధారణంగా చాలా మంది హీరోలు తమ పిల్లలను ఇండస్ట్రీకి పరిచయం చేస్తుంటే నిర్మాతగా లేదంటే సొంత బ్యానర్‌లో పరిచయం చేయడం అది కాదంటే మంచి టెక్నీషియన్స్, స్టార్ కాస్ట్ విషయంలో జోక్యం చేసుకుంటారు. మరి మీ సినిమా విషయంలో మీ తండ్రి విజయ్ ఎలాంటి సహకారం అందించారని అడిగితే జాసన్ అదిరిపోయే సమాధానం ఇచ్చాడు. జాసన్ సంజయ్ మాట్లాడటానికి ముందుకు స్టేజిపైకి రాగానే విజయ్ పేరు వినగానే అభిమానులు కేరింతలు కొట్టడం మొదలుపెట్టారు. జాసన్ సంజయ్ చిరునవ్వు నవ్వి వారి వైపు చూపించాడు. వారు తనపై కురిపించిన అపారమైన ప్రేమాభిమానికి ఫిదా అవుతూ నవ్వుతూ నమస్కారం చేశాడు.

ప్రమోషన్‌లో నాన్న పాల్గొనరు..

ఇక తన ఫస్ట్ మూవీ ప్రమోషన్‌లో తండ్రి విజయ్ పాల్గొంటారని ఆశగా అడుగుతున్న మీడియాకు, ఎదురుచూస్తున్న అభిమానులకు క్లారిటీ ఇచ్చాడు జాసన్ సంజయ్. తన సినిమా ప్రచారంలో విజయ్ పాల్గొనరని జాసన్ సంజయ్ చెప్పాడు. “మా నాన్న సిగ్మా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారని.. కాని ప్రచారం మాత్రం చేయరని చెప్పాడు. ప్రచారం అనేది ఆయనపై కాకుండా సినిమాపైనే దృష్టి సారించాలని నేను కోరుకుంటున్నానని చెప్పాడు. తన తండ్రి వల్ల సినిమా ప్రాధాన్యత మరుగున పడటం నాకు ఇష్టం లేదని సిగ్మా రిలీజైన తర్వాతే నటనకు సంబంధించిన అవకాశాలను పరిశీలిస్తానని కూడా క్లారిటీ ఇచ్చాడు జాసన్ సంజయ్.

బాక్సాఫీస్ వద్ద పోటీనా..?

వాస్తవానికి ఈ చిత్రం 2026 జూలై 31న విడుదల కావాల్సి ఉంది. అయితే ఆ తర్వాత దీనిని 2026 అక్టోబర్ 2కి వాయిదా వేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ చిత్రం ఆయన తండ్రి , యు త్రిష కృష్ణన్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘తిరుపాచి’ (Thirupachi) పునఃవిడుదలతో పోటీ పడే అవకాశం ఉంది. ఈ సినిమా ట్రైలర్ 2026 సెప్టెంబర్ 18న విడుదల కానుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *