The Paradise: ది ప్యారడైజ్ మూవీలో క్రెడిట్ అంతా KCR క్యారెక్టర్‌దే.. సీఎం రేవంత్‌రెడ్డిపై సోషల్ మీడియాలో నెటిజన్ల సెటైర్లు | ట్రెండింగ్ | ACTPnews

The Paradise Movie KCR Character Sparks Political Controversy


Last Updated:

The Paradise: ది ప్యారడైజ్ సినిమా కంటే అందులో కొద్దిసేపు మాత్రమే ఉన్న శంకరన్న క్యారెక్టర్‌కు మంచి ప్రాధాన్యం దక్కింది. ఓ రకంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు కేసీఆర్‌ను హీరోగా చూపిస్తూ సినిమా తెరకెక్కించాడని జనం చెప్పుకుంటున్నారు.

The Paradise Movie KCR Character Sparks Political Controversy
The Paradise Movie KCR Character Sparks Political Controversy

The Paradise Movie: చాలా సినిమాలు యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తారు. కొన్ని చిత్రాల్లో నిజంగా జరిగిన సన్నివేశాలు పెట్టడం సహజంగా చూస్తూ ఉంటాం. కాని భారీ బడ్దెట్‌, ఇండస్ట్రీలో టాప్ స్టార్ కాస్ట్‌ని పాత్రధారులుగా పెట్టి తీసిన సినిమాలో పొలిటికల్ పర్సనాలిటీ పాత్రను సృష్టించి సినిమా తీయడం అంటే అది కత్తి మీద సాములాంటిదే అని చెప్పాలి. ఇండస్ట్రీలో విపరీతమైన బజ్ ఏర్పడి, ఆడియన్స్ ఈగర్లీ వెయిట్ చేసిన మూవీ ది పారడైజ్. నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన ఈ సినిమా హిట్టు, ఫెయిల్ సంగతి పక్కనపెడితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక్క పాత్ర గురించే అంతా చర్చ జరుగుతోంది. ఈ సినిమాని చూడాలని హీరో నాని రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి టికెట్ ధరలు పెంచుకునేందుకు కూడా అవకాశం కల్పించారు. అయితే ది ప్యారడైజ్ సినిమాలో మాత్రం మాజీ సీఎం, తెలంగాణ సాధకుడు, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ని హీరోగా చూపించే కల్పిత పాత్రను పెట్టడం ఇప్పుడు అటు చిత్రపరిశ్రమలో.. ఇటు పొలిటికల్‌గా హాట్ టాపిక్‌గా మారింది. కేసీఆర్‌ని హీరోగా చూపించే సినిమాని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహించడంతో నెట్టింట్లో తెలంగాణ ఉన్నంత వరకు కేసీఆర్ పేరుని ఎవరూ చెరిపేయలేరంటూ కామెంట్స్ షేర్ చేస్తున్నారు. సినిమాలోని కేసీఆర్ పాత్ర సన్నివేశాల ఫోటోలను గ్రూప్‌లలో అందరితో పంచుకుంటున్నారు.

ప్యారడైజ్‌లో కేసీఆర్ హీరోగా చూపించారా..

దసరా సినిమాతో రఫ్ అండ్ రస్టిక్.. మాస్ అండ్ మార్వులెస్‌ హిట్టు కొట్టిన నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన సెకండ్ మూవీ ది ప్యారడైజ్. ఈనెల 24న వరల్డ్ వైడ్‌గా రిలీజైన సినిమా డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీ సక్సెస్, ఫెయిల్ సంగతి పక్కన పెడితే స్టోరీ లైన్‌ మాత్రం కంప్లీట్ తెలంగాణలో జాగీర్ జమానాని హైలెట్ చేస్తూ తయారు చేసుకున్నాడు శ్రీకాంత్ ఓదెల. ఇక ఈసినిమాలో 1980-85 బ్యాక్ డ్రాప్‌లో సాగిన కథలో తెలంగాణ మాస్ లీడర్, మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పాత్రను పోలిన శంకరన్న పాత్రలో యాజిటీజ్‌గా కేసీఆర్ మాటలు, వ్యవహారంతో పాటు తెలంగాణ సాధనకు ముందు చేసిన వాగ్ధానం వంటి వాటిని నటుడు ప్రియదర్శినితో చెప్పించాడు దర్శకుడు. ఇది సినిమాలో ఓ కీ పాయింట్‌ మాత్రమే అనుకుంటే ఇప్పుడు థియేటర్లలో కేసీఆర్ పాత్రకు ఊహించని రెస్పాన్స్ వస్తోంది.

రేవంత్‌కి తెలిసే ఒప్పుకున్నారా..?

గురువారం రిలీజైన ది ప్యారడైజ్ సినిమా కంటే అందులో కొద్దిసేపు మాత్రమే ఉన్న శంకరన్న క్యారెక్టర్‌కు మంచి ప్రాధాన్యం దక్కింది. ఓ రకంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు కేసీఆర్‌ను హీరోగా చూపిస్తూ సినిమా తెరకెక్కించాడని జనం చెప్పుకుంటున్నారు. ఈ విషయం తెలియక రేవంత్ రెడ్డి సర్కార్ ఈ సినిమాకు ప్రీమియర్ షోలకు అనుమతులు, టికెట్ హైకులు ఇచ్చిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు బీఆర్‌ఎస్ కార్యకర్తలు. అలాగే 1983లో సికింద్రాబాద్ నియోజికవర్గంలోని ఎమ్మెల్యే, మాలిక్ తొత్తుగా చూపించడం కూడా కాంట్రవర్సీకి కారణం కావచ్చు అంటున్నారు. ఇలాంటి పొలిటికల్ రిఫరెన్సులపై పార్టీలు, కార్యకర్తలు ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

సోషల్ మీడియాలో కేసీఆర్ జపం మొదలైంది..

అయితే ఏ సినిమాలో అయినా పాత్రలు, యధార్ధ సన్నివేశాలు పెట్టినప్పటికి కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించి తీసినవి కాదని డిస్క్లైమర్ వేసుకోవడం పరిపాటే. కాని ది ప్యారడైజ్ సినిమా విషయంలో మాత్రం ఇది భూమరాంగ్ అయిందంటున్నారు కేసీఆర్ ఫ్యాన్స్. సినిమాలో శంకరన్న పాత్రలో ప్రియదర్శిని గెటప్ వాస్తవంగా కేసీఆర్ క్యారెక్టర్‌కి దగ్గరగా ఉండటంతో రిలీజ్ రోజు నుంచే రచ్చ మొదలైపోయింది. సోషల్ మీడియాలో కేసీఆర్ నిజంగా హీరోనే అంటూ కొందరు.. నువ్వు వెయ్యి జన్మలెత్తినా కేసీఆర్ ఆనవాళ్లు చెరిపెయ్యలేవ్ కొడకా అనుకుంటున్నవేమో అంటూ మరికొందరు కామెంట్స్‌తో పాటు కేసీఆర్ గెటప్‌తో ఉన్న ప్రియదర్శిన్ ఫోటోలను షేర్ చేసుకుంటున్నారు.

క్రెడిట్ అంతా కేసీఆర్ పాత్రకే..

ది ప్యారడైజ్ సినిమా కోసం హీరో, దర్శకుడు ఎంతో కష్టపడినా.. నిర్మాత చెరుకూరి సుధాకర్ ఖర్చుకు వెనకాడకుండా భారీ బడ్జెట్‌తో సినిమా తీసినప్పటికి క్రెడిట్ అంతా శంకరన్న పాత్రకే దక్కుతోంది. ఆ తర్వాత హీరోయిన్ ఖయదు లోహర్ అందాల ఆరబోతతో ఆడియన్స్‌ని ఆకట్టుకుందనే టాక్ వినిపిస్తోంది. సినిమా రిలీజ్‌కి ముందు యేష నాగుల సాంగ్, ఆయా షేర్ రికార్డ్ బ్రేక్ చేస్తే.. ఇప్పుడు మాత్రం కేసీఆర్ పాత్ర గురించి మాత్రమే జనం, బీఆర్ఎస్ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఇదంతా ది ప్యారడైజ్ సినిమా డైరెక్టర్ కావాలనే చేశాడా.. లేక ఆయన ఆలోచనను జనం రివర్స్‌గా అర్ధం చేసుకున్నారా అనే దానిపై చిత్ర బృందం ఏమంటుందో చూడాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed