Last Updated:
నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని ఓన్లీ నాని అన్న ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ టాలీవుడ్ సినీ లవర్స్ ఈగర్‌గా వేయిట్ చేస్తున్నారు.
నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని ఓన్లీ నాని అన్న ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ టాలీవుడ్ సినీ లవర్స్ ఈగర్‌గా వేయిట్ చేస్తున్నారు. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్‌లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ విషయం మాములు హైప్ క్రియేట్ చేయట్లేదు. తాజాగా ఈ మూవీ బిజినెస్ లెక్కలు సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి.
ఈ సినిమా థియేట్రికల్ హక్కులు ఒక్కొక్కటిగా అమ్ముడు పోతున్నాయని తెలుస్తుంది. ఇప్పటికే నైజం హక్కులను మైత్రీ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పుడు రాయలసీమ మినహా ఆంధ్ర మొత్తం థియేట్రికల్ రైట్స్ అమ్మే పనిలో ఉన్నారట నిర్మాతలు. ఇన్ సైడ్ రిపోర్ట్స్ ప్రకారం.. రాయలసీమ కాకుండా ఆంధ్ర ఏరియా థియేట్రికల్ రైట్స్ కోసం మేకర్స్ ఏకంగా రూ.40 కోట్ల వరకు కోట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. నిజానికి ఇది చాలా పెద్ద నెంబర్. నానికి ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరంగా చూసుకుంటే ఇది చాలా పెద్ద ఫిగర్. ఈ ఏరియాలో బ్రేక్ ఈవెన్ కావాలంటే అక్షరాల రూ.80 కోట్ల గ్రాస్ కొల్లగొట్టాల్సి ఉంటుంది.
అంటే సినిమాకు బీభత్సమైన హిట్టు టాక్ వస్తేనే ఆ రేంజ్ కలెక్షన్లు వసూళ్ చేయవచ్చు. మరి మేకర్స్ డిమాండ్ చేస్తున్న ఆ ఫిగర్‌కు డిస్ట్రిబ్యూటర్లు ముందుకొస్తారా? లేదంటే తక్కువకు బేరం ఆడతారా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి ఈ సినిమాపై ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దసరాతో వీర విధ్వంసం సృష్టించిన నాని, శ్రీకాంత్ ఓదెలా.. ఈ సారి ఇంకా ఏ రేంజ్ సినిమా తీస్తారా అని జనాల్లో చాలా క్యూరియాసిటీ ఉంది.
మరీ ముఖ్యంగా ఆ మధ్య రిలీజైన ‘ది ప్యారడైజ్ అనౌన్స్మెంట్ వీడియో గురించి మాటల్లో వర్ణించడానికి కూడా పదాలు లేవు. అసలు నానిలో ఈ రేంజ్ మేకోవర్ చూసి మైండ్ దొబ్బేసింది. ఏం సినిమా తీస్తున్నార్రా నాయనా అనిపించేంతలా ఒక్క వీడియోతో అందరి అటెన్షన్‌ను తన వైపు తిప్పేసుకున్నాడు నాని. అనౌన్స్మెంట్ వీడియోతో సినిమా స్టోరీపై కొద్దో గొప్పో క్లారిటీ ఇచ్చాడు. పక్షి జాతిలో అందరు చులకనగా చూసేది కాకులునే. అలా కాకుల్లానే అణచివేతకు గురైన ఓ జాతి కథను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు శ్రీకాంత్ క్లారిటీ ఇచ్చేశాడు. ఇక్కడ మేయిన్ ట్విస్ట్ ఏంటంటే.. ఈ జాతికి నాయకుడు ఒక వేశ్యకు పుట్టినవాడు.
రెండు జుట్లతో అరివీర భయంకరమైన లుక్‌లో నాని మేకోవర్ ముందు గూస్బంప్స్ అనే మాట కూడా చాలా చిన్నదబ్బా. ఇప్పటివరకు టాలీవుడ్ చరిత్రలోనే ఇలాంటి అనౌన్స్మెంట్ వీడియో నెవర్ బిఫోర్. ఈ ఒక్క వీడియోతో సినిమాపై అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. ఆ తర్వాత రిలీజైన ఆయా షేర్ పాట మరో విధ్వంసం. అసలు ఈ పాట చూస్తుండగానే 100 మిలియన్లకు పైగా వ్యూస్ కొల్లగొట్టి టాలీవుడ్లో ఆ మార్క్ అందుకున్న ఫాస్టెస్ట్ పాటగా నిలిచింది. అనిరుధ్ బ్రో ఏం తాగి కొట్టాడో కానీ పాట మాత్రం సినిమాకు మాములు హైప్ తెచ్చిపెట్టలేదు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఖయదు లోహర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సోనాలి కులకర్ణి కీలక పాత్రలో నటిస్తుంది.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














