The Paradise Ticket Rates: ‘ది ప్యారడైజ్’ టికెట్ ధరల పెంపుపై హైకోర్టు సీరియస్.. ఏం చెప్పిందంటే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ (The Paradise) సినిమాకి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. టికెట్ ధరల పెంపుపై న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

News18
News18

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ (The Paradise) సినిమాకి తెలంగాణ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమా టికెట్ రేట్లను పెంచుకోవడానికి, అలాగే ప్రీమియర్ షోల ప్రదర్శనకు అనుమతి ఇస్తూ రాష్ట్ర హోంశాఖ జారీ చేసిన మెమోను తక్షణమే పునఃపరిశీలించి వెనక్కి తీసుకోవాలని తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, ఐపీఎస్ అధికారిణి శిఖా గోయెల్‌కు న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

సెప్టెంబర్ 24న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి సెప్టెంబర్ 23 సాయంత్రం 6.30 గంటలకు ప్రత్యేక ప్రీమియర్ షోలు ప్రదర్శించుకోవడానికి, ఆ షోల టికెట్ ధరను రూ.500గా నిర్ణయిస్తూ సెప్టెంబర్ 20న హోంశాఖ ముఖ్య కార్యదర్శి మెమోను జారీ చేశారు. అయితే, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులకు పూర్తిగా విరుద్ధంగా ఉందంటూ న్యాయవాది, సామాజిక కార్యకర్త విజయ్ గోపాల్ మంగళవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా.. సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 14న జారీ చేసిన జీవో నంబర్ 77ను ధర్మాసనం ప్రముఖంగా ప్రస్తావించింది. ఈ నూతన జీవోలోని 8, 9, 10, 11 షరతుల ప్రకారం కేవలం రూ. 100 కోట్లకు పైగా బడ్జెట్ ఉన్న భారీ చిత్రాలకు మాత్రమే రేట్ హైక్‌కు అనుమతి ఉంటుందని కోర్టు తెలిపింది. అలాగే, సదరు నిర్మాతలు సినీ కార్మికుల సంక్షేమ నిధికి విధిగా నిధులు డిపాజిట్ చేయాలనే కీలక నిబంధన ఉంది. కానీ, ‘ది ప్యారడైజ్’ సినిమా విషయంలో ఈ షరతులను పాటించినట్లు ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ, రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం ఎలా అనుమతి ఇచ్చిందని ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed