Last Updated:
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందిన ‘ది ప్యారడైజ్’ మూవీ ప్రీమియర్స్ పడ్డాయి. ఈ షోస్ చుసిన ఆడియన్స్ తమ రెస్పాన్స్ చెబుతున్నారు. ఆ వివరాలు చూద్దామా..
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందిన ‘ది ప్యారడైజ్’ మూవీ ప్రీమియర్స్ పడ్డాయి. ప్రమోషన్స్ పరంగా కనీసం ట్రైలర్ కూడా రిలీజ్ చేయడకుండానే భారీ హైప్ అయితే తీసుకొచ్చారు మేకర్స్. దీంతో ఈ సినిమాతో నాని రేంజ్ మారిపోతుందని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ, తీరా చూస్తే ప్రీమియర్స్ తోనే ఆడియన్స్ లో నెగెటివ్ టాక్ రావడం షాకింగ్ పరిమాణంగా మారింది. ట్విట్టర్ లో అయితే ఒక్కొక్కరు ఈ సినిమా గురించి పెడుతున్న పోస్టులు ఆదిలోనే ఆడియన్స్ ఇంట్రెస్ట్ పై నీళ్లు చల్లేలా ఉన్నాయి.
ఫస్టాఫ్ పర్వాలేదు కానీ, సెకండాఫ్ అయితే హాయిగా పడుకోవచ్చు అని కనిపిస్తున్న పోస్టులు ఈ సినిమా డిజాస్టర్ అనే సంకేతాలు ఇస్తున్నాయి. కొందరైతే ఈ సినిమాకు వెళ్లిన వారికి బైక్, కార్ పార్కింగ్ ఫీజులు కూడా దండగే అని చెబుతున్నారంటే సినిమా కథ, కథనాల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
Just finished watching #TheParadise !! 🦅
⭐⭐⭐#1sthalf : Jail fight, Aaya Sher, Anirudh bgm & the interval scene ki (mental aipotharu) 🥵🥵🥵#2ndhalf : Mother sentiment, Nani Thandavam & it’s bgm, Yeshanagula song, NTR, KCR References & the climax fight is good. Music… pic.twitter.com/89yX6vooL1— Teja for Jr NTR ❤️ (@TejaforTarak) September 23, 2026
ఇదిలా ఉంటే నాని ఎంట్రీ సీన్, ఆయా షేర్ సాంగ్, అదేవిధంగా జైల్ ఫైట్ సీక్వెన్స్, హై-వోల్టేజ్ ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం థియేటర్లలో బాగా అట్రాక్ట్ చేసిందని కొందరు చెబుతున్నారు. సెకండాఫ్ లో అయితే మదర్ సెంటిమెంట్, నాని తాండవం, యెషనాగుల సాంగ్, క్లైమాక్స్ ఫైట్ గుడ్ అని ఇంకొందరు చెబుతున్నారు. ఏదేమైనా ఈ సినిమాకు ఇప్పటికైతే మిశ్రమ స్పందనే వచ్చిందని చెప్పుకోవాలి. చూడాలి మరి ఫిలిం క్రిటిక్స్ సినిమాపై ఎలాంటి రివ్యూస్ ఇస్తారు? అసలు నాని ప్యారడైజ్ హిట్టా, ఫట్టా అనేది?.














