Last Updated:
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రాశి కొత్త సినిమా ‘ది రెడ్ బ్యాగ్’. ఈ సినిమాలో ఆమె రోల్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో తెలిసేలా తాజాగా కొత్త పోస్టర్ వేదిలారు మేకర్స్.
మెమరీ మేకర్స్ బ్యానర్ పై డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్‌తో కొత్త నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి ‘ది రెడ్ బ్యాగ్’ అనే సినిమాని నిర్మిస్తున్నారు. బ్యాగ్ చుట్టూ తిరిగే ఈ మూవీకి రవి కుమార్ సీరపు కథ, కథనం, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు.ఈ చిత్రంలో కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బదల్, భార్గవి తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి స్పెషల్ రోల్ పోషిస్తున్న రాశీ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.
‘ది రెడ్ బ్యాగ్’ సినిమాలో సావిత్రి పాత్రలో ఓ పవర్ ఫుల్ రోల్ పోషించారు రాశీ. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో ఈ పాత్రకు సంబంధించిన గెటప్, లుక్స్ ఎంత సింపుల్‌గా ఉన్నాయో.. ఆమె లుక్ అంత ఇంటెన్స్‌గా ఉంది. చూస్తుంటే ఈ రోల్ రాశి కెరీర్ లోనే ప్రత్యేకం కానుందని అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే టీజర్‌ను రెడీ చేస్తున్నట్టుగా తెలిపిన చిత్ర యూనిట్.. టీజర్‌తో మూవీపై మరింత బజ్ క్రియేట్ అవుతుందని అంటున్నారు. తొలి సినిమానే అయినా, నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీకి శేఖర్ మోపురి సంగీతమందించగా.. ప్రియేష్ గురుసామి కెమెరామెన్‌గా, శివ శర్వాని ఎడిటర్‌గా పని చేశారు.
ఈ సినిమాలో కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బదల్, భార్గవి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తుండగా.. శేఖర్ మోపురి సంగీతం అందిస్తున్నారు.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













