Thella Kagitham: రిలీజ్‌కు ముందే ‘తెల్ల కాగితం’ సినిమా ఆన్ లైన్‌లో లీక్.. టీమ్ సంచలన ప్రకటన! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘తెల్లకాగితం’కు విడుదలకు ముందే ఊహించని షాక్ తగిలింది. థియేట్రికల్ రిలీజ్‌కు కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఉన్న సమయంలో సినిమాకు సంబంధించిన కీలకమైన కంటెంట్ ఆన్‌లైన్‌లో లీక్ కావడం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

News18
News18

అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘తెల్లకాగితం’కు విడుదలకు ముందే ఊహించని షాక్ తగిలింది. థియేట్రికల్ రిలీజ్‌కు కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఉన్న సమయంలో సినిమాకు సంబంధించిన కీలకమైన కంటెంట్ ఆన్‌లైన్‌లో లీక్ కావడం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామంతో సినిమా నిర్మాతతో పాటు దర్శకుడు, టెక్నీషియన్లు, చిత్రబృందం ఆందోళనకు గురైంది. ఎంతో కష్టపడి రూపొందించిన సినిమా విడుదలకు ముందు ఇలా లీక్ కావడం తమను తీవ్రంగా కలచివేసిందని యూనిట్ ఆవేదన వ్యక్తం చేసింది.

సినిమా కంటెంట్ అనుమతి లేకుండా ఆన్‌లైన్‌లో ప్రచారం జరుగుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని ‘తెల్లకాగితం’ చిత్రబృందం తెలిపింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులకు ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. లీకైన కంటెంట్‌ను ఎవరూ డౌన్‌లోడ్ చేయవద్దని, ఇతరులకు పంపించవద్దని, సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని కోరింది. సినిమా అనుభూతిని థియేటర్లలోనే పొందాలని, తమ చిత్రబృందానికి ప్రేక్షకులు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేసింది.

ఈ మేరకు ‘తెల్లకాగితం’ టీమ్ ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. తమ సినిమాకు సంబంధించిన కంటెంట్ అనుమతి లేకుండా ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొంది. సినిమా కంటెంట్‌ను లీక్ చేయడం, డౌన్‌లోడ్ చేయడం, షేర్ చేయడం చట్టపరంగా తప్పు అని స్పష్టం చేసింది. ఇప్పటికే ఆన్‌లైన్‌లోకి వచ్చిన కంటెంట్‌ను మరింతగా సర్క్యులేట్ చేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరింది.

సినిమా విడుదలకు ముందు కంటెంట్ లీక్ కావడం చిత్రబృందానికి పలు రకాలుగా నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కీలకమైన సన్నివేశాలు లేదా కథకు సంబంధించిన విషయాలు బయటకు వస్తే థియేటర్లలో ప్రేక్షకులు పొందాల్సిన అనుభూతిపై ప్రభావం పడే అవకాశం ఉంది. అంతేకాకుండా సినిమాను రూపొందించేందుకు నిర్మాతలు, నటీనటులు, టెక్నీషియన్లు చేసిన కృషికి కూడా ఇది ఇబ్బందికరమైన పరిణామంగా మారుతుంది.

ఒక సినిమా వెనుక నటీనటులతో పాటు వందలాది మంది టెక్నీషియన్లు, కార్మికుల కష్టం ఉంటుందని చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి లీకులు, పైరసీ కారణంగా సినిమా బిజినెస్‌పై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకే ప్రేక్షకులు లీకైన కంటెంట్‌ను ప్రోత్సహించకుండా బాధ్యతగా వ్యవహరించాలని కోరుతున్నారు.

ప్రస్తుతం ‘తెల్లకాగితం’ చిత్రబృందం తమ సినిమాను అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. విడుదలకు ముందు ఎదురైన ఈ లీక్‌ సమస్య నుంచి బయటపడేందుకు చిత్రయూనిట్ చర్యలు తీసుకుంటోంది. మరోవైపు ప్రేక్షకులు కూడా లీకైన కంటెంట్‌కు దూరంగా ఉండి, సినిమాను థియేటర్లలో వీక్షించాలని చిత్రబృందం కోరుతోంది. విడుదలకు ముందే ఎదురైన ఈ అనూహ్య పరిణామం తర్వాత ‘తెల్లకాగితం’ టీమ్ విజ్ఞప్తిపై ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports