Last Updated:
తిరుమల సీఆర్వో కార్యాలయం వద్ద నకిలీ గుర్తింపు పత్రాలతో గదులు పొంది.. వాటిని అధిక ధరలకు విక్రయించేందుకు ప్రయత్నించిన దళారీ ముఠా వ్యవహారాన్ని టీటీడీ విజిలెన్స్ అధికారులు భగ్నం చేశారు.
తిరుమల సీఆర్వో కార్యాలయం వద్ద నకిలీ గుర్తింపు పత్రాలతో వేరొకరి పేర్లపై గదులు పొంది వాటిని అధిక ధరలకు భక్తులకు విక్రయిస్తున్న దళారీ ముఠా ప్రయత్నాన్ని టీటీడీ విజిలెన్స్ విభాగం భగ్నం చేసింది. ఆగస్టు 16న అప్పటికే ఒక గది పొందిన వ్యక్తి మరో గుర్తింపుతో తిరిగి గది కోసం క్యూలో నిలబడటాన్ని సీఆర్వో సిబ్బంది గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడిని కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన ఆషిక్ అలీ పి.ఎం. (32)గా గుర్తించారు. అతని వద్ద రెండు నకిలీ ఆధార్ కార్డులు, గది రిజిస్ట్రేషన్ స్లిప్, రూ.800 నగదు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.














