Last Updated:
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలలో భద్రతా సన్నద్ధతను పరీక్షించేందుకు లడ్డూ కౌంటర్ల వద్ద మాక్ డ్రిల్ నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులను సురక్షితంగా తరలించడం, క్షతగాత్రులకు వైద్యం అందించడం, వివిధ భద్రతా విభాగాల సమన్వయాన్ని అధికారులు పరిశీలించారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలలో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేసేందుకు అత్యవసర పరిస్థితుల్లో చేపట్టాల్సిన రక్షణ, ప్రతిస్పందన చర్యలపై మాక్ డ్రిల్ నిర్వహించారు. IGP, OCTOPUS ఆదేశాల మేరకు తిరుమలలో విధులు నిర్వహిస్తున్న ఆక్టోపస్ బృందం ఆధ్వర్యంలో ఈ విన్యాసం చేపట్టారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే ముఖ్యమైన ప్రాంతాల్లో ఏదైనా అవాంఛనీయ ఘటన లేదా ఉగ్రవాద దాడి జరిగినప్పుడు వివిధ భద్రతా విభాగాలు ఎలా సమన్వయంతో స్పందించాలి, భక్తులను సురక్షిత ప్రాంతాలకు ఎలా తరలించాలి అనే అంశాలను మాక్ డ్రిల్ ద్వారా ప్రాక్టికల్‌గా పరిశీలించారు.














