Tirumala Darshan: ప్లాట్ కొంటే జీవితాంతం తిరుమల శ్రీవారి వీఐపీ దర్శనం ఫ్రీ? ఈ విషయం తెలిస్తే అవాక్కవుతారు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

Tirumala Darshan: ప్లాట్ కొంటే జీవితాంతం శ్రీవారి వీఐపీ దర్శనం ఫ్రీ? ఈ విషయం తెలిస్తే అవాక్కవుతారు!


Last Updated:

శ్రీవారి దర్శనాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం.. ఆ కంపెనీకి టీటీడీ దిమ్మతిరిగే కౌంటర్

Tirumala Darshan: ప్లాట్ కొంటే జీవితాంతం శ్రీవారి వీఐపీ దర్శనం ఫ్రీ? ఈ విషయం తెలిస్తే అవాక్కవుతారు!
Tirumala Darshan: ప్లాట్ కొంటే జీవితాంతం శ్రీవారి వీఐపీ దర్శనం ఫ్రీ? ఈ విషయం తెలిస్తే అవాక్కవుతారు!

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఒక్కసారైనా దర్శించుకోవాలని కోట్లాది మంది భక్తులు నిత్యం పరితపిస్తుంటారు. సరిగ్గా భక్తుల అమాయకత్వాన్ని, ఆపారమైన భక్తివిశ్వాసాలను ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు తమ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపారు. ఏకంగా స్వామివారి పవిత్రమైన పేరును, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిష్ఠను అడ్డుపెట్టుకుంటూ సోషల్ మీడియాలో భారీ మోసానికి శ్రీకారం చుట్టారు. భక్తులను తప్పుదోవ పట్టించేలా సాగుతున్న ఈ దారుణమైన వ్యవహారంపై టీటీడీ ఉన్నతాధికారులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మి ఎవరూ మోసపోవద్దని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.

“తిరుపతి హైవేలో మా దగ్గర ప్లాట్లు కొనుగోలు చేస్తే చాలు.. జీవితాంతం శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తాం” అంటూ ‘ఎస్సీపీ డెవలపర్స్’ (SCP Developers) అనే రియల్ ఎస్టేట్ సంస్థ కొన్ని రీల్స్, ప్రకటనల రూపంలో విస్తృతంగా ప్రచారం చేసింది. సోషల్ మీడియా వేదికగా సాగిన ఈ తప్పుడు ప్రచారం భక్తుల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ వార్తలు అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ సంస్థ ఇస్తున్న ఆఫర్‌తో టీటీడీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఆ సంస్థ చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని, ఇది కేవలం వ్యాపారాభివృద్ధి కోసం భక్తులను తప్పుదోవ పట్టించే కుట్రలో భాగమేనని అధికారులు స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Bhogapuram Airport: ఏపీ చరిత్రలో మరో సంచలనం.. మాయం కాబోతున్న ‘VTZ’ కోడ్! ఎందుకో తెలుసా? వైజాగ్‌కు చివరి విమానం అప్పుడే..

శ్రీవారి దర్శనానికి సంబంధించిన విధానాలు, సేవలు, ప్రత్యేక దర్శనాలు, టికెట్ల జారీ తదితర అంశాలన్నీ పూర్తిగా టీటీడీ స్వయంగా రూపొందించిన కఠిన నిబంధనలు, పక్కా మార్గదర్శకాల ప్రకారమే నిరంతరం అమలవుతాయి. భక్తులకు ఇలాంటి వీఐపీ దర్శన హామీలు ఇచ్చే అధికారం ఏ ఒక్క ప్రైవేట్ సంస్థకు గానీ, ఏ దళారికి గానీ అస్సలు లేదు. పవిత్రమైన దేవుడి పేరును, దర్శనాలను స్వార్థపూరిత వ్యాపార ప్రయోజనాలకు వాడుకుంటూ కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమైన చర్య అని బోర్డు తీవ్రంగా తప్పుపట్టింది. ఇలాంటి అనధికారిక ప్రకటనలను చూసి గుడ్డిగా నమ్మి మోసపోవద్దని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.

ఇది కూడా చదవండి: టెన్త్ పాసైన విద్యార్థులకు బంపరాఫర్.. పైసా ఖర్చు లేకుండా ఇంటర్ సీటు, పరీక్ష లేదు- ఫీజు లేదు!

భక్తులు శ్రీవారి దర్శనాలకు సంబంధించిన ఏ చిన్న సమాచారం కోసమైనా సరే టీటీడీ పత్రికా ప్రకటనలు, అధికారిక వెబ్‌సైట్, అధికారిక సోషల్ మీడియా ఖాతాలను మాత్రమే ఎల్లప్పుడూ విశ్వసించాలని అధికారులు సూచించారు. మరోవైపు ఈ మోసపూరిత ప్రకటనలపై విజిలెన్స్ అధికారులు లోతైన విచారణ ప్రారంభించారు. విచారణ మొదలవగానే భయపడిన సదరు రియల్ ఎస్టేట్ సంస్థ తమ వ్యాపార ప్రకటనలను సోషల్ మీడియా నుంచి ఆఘమేఘాల మీద తొలగించినట్లు అధికారులు గుర్తించారు. వారు సోషల్ మీడియా నుంచి ఆ యాడ్స్ డిలీట్ చేసినంత మాత్రాన చేసిన తప్పు తీవ్రత ఏమాత్రం తగ్గదని, శిక్ష నుంచి ఎవరూ తప్పించుకోలేరని టీటీడీ వర్గాలు స్పష్టం చేశాయి.

దేవుడి పేరు మీద భక్తుల విశ్వాసాన్ని దుర్వినియోగం చేస్తూ కోట్ల రూపాయల వ్యాపార లాభాలు పొందాలని చూస్తే ఏమాత్రం సహించే ప్రసక్తే లేదని అధికారులు గట్టిగా హెచ్చరించారు. ఈ వ్యవహారంలో ఆ ఎస్సీపీ డెవలపర్స్ సంస్థపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకునేలా పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేస్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో కూడా ఎవరైనా సరే టీటీడీ పేరుతో తప్పుడు హామీలు ఇస్తూ డబ్బులు వసూలు చేయాలని చూస్తే చట్టపరంగా కఠినమైన శిక్షలు తప్పవని తేల్చి చెప్పారు. భక్తులకు దర్శనాల విషయంలో ఏ చిన్న సందేహం వచ్చినా వెంటనే నేరుగా అధికారిక వేదికల ద్వారా నిజానిజాలు నిర్ధారించుకోవాలని టీటీడీ మరోసారి కోరింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports