Tirumala Darshan: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. దర్శనం విషయంలో టీటీడీ కీలక నిర్ణయం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

News18


Last Updated:

తిరుమలలో ఆ రెండు రోజులు ఆ సేవలు బంద్.. టీటీడీ సడన్ డెసిషన్ వెనుక అసలు కారణం ఇదే!

News18
News18

కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల గిరులు భక్తజన సంద్రంగా మారాయి. అత్యంత పవిత్రమైన పెరటాసి మాసం కొనసాగుతుండటంతో గోవింద నామస్మరణతో సప్తగిరులు మార్మోగుతున్నాయి. దీనికి తోడు వరుస సెలవులు వస్తుండటంతో శ్రీవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ విశేషంగా పెరుగుతోంది. వేలాదిగా తరలివస్తున్న సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వసతులు లేక, గంటల కొద్దీ క్యూలైన్లలో వేచి ఉండే సామాన్యుల నిరీక్షణ సమయాన్ని వీలైనంత మేర తగ్గించే ఉద్దేశంతో స్వామివారి దర్శన నిబంధనల్లో కొన్ని మార్పులు చేస్తూ సంచలన ప్రకటన చేసింది.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ 1వ తేదీ గురువారం, అక్టోబర్ 5వ తేదీ సోమవారం రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారికంగా వెల్లడించింది. కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ముఖ్యమైన ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే ఈ బ్రేక్ దర్శనానికి అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది. మిగతా ఏ ఒక్కరికీ వీఐపీ దర్శనాలు ఉండవని తేల్చి చెప్పింది. వరుస సెలవులు వస్తుండటం, అదే సమయంలో పెరటాసి మాసం కావడం వల్ల తమిళనాడు సహా ఇతర రాష్ట్రాల నుంచి భక్తుల తాకిడి విపరీతంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకే ఈ రద్దీని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: SBI Life Smart Shield Plus: నెలకు రూ.1,200 కడితే చాలు కోటి రూపాయలు గ్యారంటీ.. అదిరే పాలసీ స్కీమ్!

ప్రస్తుతం తిరుమల కొండపై ఉన్న పరిస్థితులను గమనిస్తే ప్రతిరోజూ సుమారు 80 వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనభాగ్యం కల్పిస్తున్నారు. అయితే దర్శనం చేసుకుంటున్న వారి సంఖ్య కంటే, కొత్తగా కొండపైకి చేరుకుంటున్న వారి సంఖ్య భారీగా ఉంటోంది. ప్రతిరోజూ అదనంగా సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం నిరీక్షిస్తున్నారు. ఈ అదనపు రద్దీ కారణంగా ఆ రోజు వచ్చిన భక్తులకు అదే రోజు దర్శనం దొరకని పరిస్థితి ఏర్పడింది. ఆ భక్తులు తప్పనిసరిగా మరుసటి రోజు శ్రీవారిని దర్శించుకోవాల్సి వస్తోంది. దీంతో క్యూకాంప్లెక్స్‌లు పూర్తిగా నిండిపోయి, సామాన్య భక్తులు దర్శనం కోసం వేచి ఉండే సమయం క్రమంగా పెరిగిపోతోంది.

ఇది కూడా చదవండి: ధర పెరగడంతో రూటు మార్చిన దొంగలు.. వాటిని కూడా వదలడం లేదు!

ఈ బ్రేక్ దర్శనాల రద్దు కారణంగా సిఫార్సు లేఖల స్వీకరణను కూడా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన అక్టోబర్ 1వ తేదీకి ముందు రోజు అయిన సెప్టెంబర్ 30వ తేదీ బుధవారం నాడు ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది. అదేవిధంగా అక్టోబర్ 5వ తేదీకి ముందు రోజు అయిన అక్టోబర్ 4వ తేదీ ఆదివారం నాడు కూడా వీఐపీ దర్శనాలకు సంబంధించిన లేఖలను తీసుకోరు. కాబట్టి ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు ఈ విషయాన్ని గమనించి తమ కార్యాలయాల నుంచి ఎవరికీ దర్శనం కోసం సిఫార్సు లేఖలు జారీ చేయవద్దని అధికారులు కోరుతున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ, దర్శనం కోసం రోజుల తరబడి వేచి ఉన్న భక్తుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని సామాన్యుల కోసమే ఈ కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నట్లు టీటీడీ సవివరంగా తెలియజేసింది. రాబోయే పండుగ సెలవుల నేపథ్యంలో పరిస్థితులు మరింత రద్దీగా మారే అవకాశం ఉందని, అందుకే ముందుస్తుగా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని వెల్లడించింది. సామాన్య భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యంత సులభంగా, త్వరితగతిన శ్రీవారి దర్శనం చేసుకునేలా టీటీడీ చేస్తున్న ఈ ప్రత్యేక ఏర్పాట్లకు భక్తులందరూ సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. బ్రేక్ దర్శనాల రద్దుతో సాధారణ భక్తులకు ఎంతో ఊరట లభిస్తుందని, స్వామివారి దర్శనం మరింత వేగంగా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed