వైజాగ్ బ్యాచలర్ అనే ఇన్టాగ్రామ్ పేజీ అడ్మిన్ శ్రీకాంత్ తెలిపిన ప్రకారం వచ్చే నెలలోనే శ్రీవారిని దర్శనం చేసుకోవాలనుకుంటే ఈ సింపుల్ మెథడ్ ఫాలో అవ్వండి. దాని కోసం మీరు శ్రీవారి సేవల్లో భాగంగా ఉండే శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్ కొనాల్సి ఉంటుంది. ఈ హోమంలో పాల్గొనడం వల్ల కుటుంబానికి శుభం, ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. అయితే ఈ సేవకు ఎలా టికెట్ బుక్ చేసుకోవాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఎప్పుడు బుక్ చేయాలి, దీనికి చేసుకుంటే శ్రీవారి దర్శనం ఎలా అవుతుంది అనే విషయాలు చాలామందికి తెలియవు.














