Last Updated:
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి శ్రీవారి పట్టు వస్త్రంతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు.
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం సాయంత్రం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న ఆయన.. శ్రీవాణి ట్రస్ట్ వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు చేరుకున్న యూపీ సీఎంకు టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి ఘన స్వాగతం పలికారు. అనంతరం దర్శనానికి అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు.













