Last Updated:
మాజీ టీటీడీ ఈఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని మాజీ టీటీడీ ఈఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న ఆయన.. విఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.













