సౌత్ సెంట్రల్ రైల్వే ఈ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను మొత్తం 20 కోచ్‌లతో నడపనున్నట్లు తెలిపింది. ఇందులో 2 ఏసీ 2-టైర్ కోచ్‌లు, 8 ఏసీ 3-టైర్ కోచ్‌లు, 6 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 4 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. దీంతో ప్రయాణికులు తమ అవసరానికి, బడ్జెట్‌కు తగ్గట్టు ఏసీ కోచ్‌లు, స్లీపర్ క్లాస్, జనరల్ క్లాస్‌లో టికెట్ తీసుకునే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూస్తే, ఇప్పటివరకు వీక్లీ స్పెషల్‌గా ఉన్న కాచిగూడ-తిరుచానూరు రైలు ఇక రెగ్యులర్ ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌గా మారింది. కొత్త ట్రైన్ నంబర్లతో ప్రతి వారం ఈ సర్వీస్ నడవనుంది. (ప్రతీకాత్మక చిత్రం)














