Today Top 10 News: ఒక్కరోజులో దేశంలో ఏం జరిగింది? టాప్-10 కీలక పరిణామాలు ఇవే | తెలంగాణ వార్తలు | ACTPnews

Today Top 10 News: ఎబోలా వైరస్ పై కేంద్రం హెచ్చరికలు.. సోషల్ మీడియాను షేక్ చేసిన ఎన్టీఆర్ | తెలంగాణ వార్తలు


హరీశ్‌రావు అమెరికా పర్యటనలో మాట్లాడుతూ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫ్యూచర్‌సిటీని రద్దు చేసి ఫార్మాసిటీని పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారమే చేస్తోందని ఆరోపించారు. ఫార్మాసిటీ వల్ల లక్షలాది ఉద్యోగాలు వస్తాయని, ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాలు కోర్టులో నిలవవని వ్యాఖ్యానించారు. రైతుల భూములు వెనక్కి ఇవ్వాలన్న చట్టాన్ని ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని విమర్శించారు.

——–

2.భగీరథ్‌ను దాచిపెట్టారు

బండి భగీరథ్‌పై ఉన్న పోక్సో కేసులో సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్ కుమ్మక్కై నిందితుడిని కాపాడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రాష్ట్రంలో 35 శాతం కూడా కొనుగోళ్లు జరగలేదన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ, పలువురు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోళ్లపై శ్వేతపత్రం విడుదల చేయాలని, పోక్సో కేసు నిందితుడిని 9 రోజులు ఎవరు దాచారో వెల్లడించాలని డిమాండ్ చేశారు.

———–

3.విచిత్రంగా టీడీపీ, బీజేపీ వైఖరి..!

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై టీడీపీ నేత నారా లోకేశ్ అనవసర గందరగోళం సృష్టిస్తున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. జనాభా నియంత్రణలో విజయవంతమైన దక్షిణాది రాష్ట్రాలను రాజకీయంగా శిక్షించకూడదని కాంగ్రెస్ స్పష్టం చేసిందన్నారు. కేవలం లోక్‌సభ సీట్లు పెరగడం కాదు, దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం, నిర్ణయాధికారం తగ్గకుండా చూడటమే అసలు సవాల్ అని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం దీనిపై స్పష్టమైన రాజ్యాంగ హామీ ఇవ్వలేదని, వికేంద్రీకరణ వంటి ప్రత్యామ్నాయాలను పట్టించుకోలేదని ఆరోపించారు. దక్షిణాది ప్రయోజనాల కోసం పోరాడిన టీడీపీ ఇప్పుడు బీజేపీ వైఖరిని సమర్థించడం విచిత్రమని షర్మిల అన్నారు.

———

4.జగన్‌కు భయం మొదలైంది

మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వైకాపా పాలనలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం నారా చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమైందని, ఆయన నాయకత్వంలో గత రెండేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరుగుతోందన్నారు. అమరావతి అభివృద్ధి చూసి జగన్‌కు భయం పట్టుకుందని,వచ్చే ఎన్నికల్లో వైకాపాకు తీవ్ర పరాజయం తప్పదని వ్యాఖ్యానించారు. జగన్ కుటుంబ వ్యాఖ్యలపై స్పందిస్తూ, గత ఘటనల గురించి ప్రజలకు అన్నీ తెలుసని అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రానికి, దేశానికి చంద్రబాబు రోల్ మోడల్‌గా నిలుస్తున్నారని పేర్కొన్నారు.

———-

5.ప్రభాస్‌ ఎంతోమందికి స్ఫూర్తి

అగ్ర హీరో ప్రభాస్ ప్రస్తుతం ‘స్పిరిట్’, ‘ఫౌజీ’ చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. ఎండలను కూడా లెక్కచేయకుండా రెండు సినిమాల షూటింగ్‌లను సమాంతరంగా పూర్తి చేస్తున్నట్లు సమాచారం.‘స్పిరిట్’లో నటిస్తున్న బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రభాస్ వినయం, కష్టపడి పనిచేసే తత్వాన్ని ప్రశంసించారు.అంత పెద్ద స్టార్ అయినా గర్వం లేకుండా అందరితో కలిసిపోతారని, షూటింగ్ లొకేషన్‌కు రుచికరమైన భోజనం తీసుకువస్తారని చెప్పారు.

విభిన్న కథలతో తెరకెక్కుతున్న ఈ సినిమాల కోసం ప్రభాస్ తన లుక్స్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

——–

6.కంగనాకు రహస్యంగా పెళ్లయిందా?

నటి కంగనా రనౌత్ మెడలో మంగళసూత్రంతో కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.దీంతో ఆమె రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే ప్రచారం జోరందుకుంది.అయితే అది నిజం కాదని, ‘క్వీన్ 2’ సినిమా షూటింగ్‌లో భాగంగా కంగనా ఆ లుక్‌లో కనిపించినట్లు స్పష్టమైంది.

దర్శకుడు వికాస్ బహల్ కూడా ‘క్వీన్ 2’ తెరకెక్కుతున్న విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు.‘క్వీన్’ సీక్వెల్‌పై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

——–

7.మోదీకి జల్‌మురి అమ్మిన వ్యాపారికి పాక్ బెదిరింపులు

పశ్చిమ బెంగాల్‌కు చెందిన జల్‌మురి వ్యాపారి విక్రమ్ సావోకు ప్రధాని నరేంద్ర మోదీ స్నాక్స్ రుచి చూసిన తర్వాత ఊహించని సమస్యలు ఎదురయ్యాయి.

మోదీ తన దుకాణానికి వచ్చిన వీడియో వైరల్ కావడంతో విక్రమ్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.అయితే అప్పటి నుంచి పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి హత్య బెదిరింపులు వస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.వీడియో కాల్స్, వాట్సాప్ సందేశాల ద్వారా బాంబులతో చంపేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు.పోలీసులు కేసు నమోదు చేసి విక్రమ్ సావోకు భద్రత కల్పించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

————

8.భారత్‌ నుంచి పాక్‌కు పాకిన ‘బొద్దింక’!

భారత్‌లో వైరల్ అయిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ట్రెండ్ ఇప్పుడు పాకిస్థాన్‌కూ చేరింది. అక్కడ ‘కాక్రోచ్ అవామీ పార్టీ’, ‘కాక్రోచ్ అవామీ లీగ్’ పేర్లతో సోషల్ మీడియాలో కొత్త గ్రూపులు వెలుగులోకి వచ్చాయి.నిరుద్యోగ యువత తమ అసంతృప్తిని వ్యక్తం చేసేందుకు ఈ ట్రెండ్‌ను వేదికగా మార్చుకుంటోంది. పీటీఐ, పీఎంఎల్-ఎన్, పీపీపీ వంటి ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఈ గ్రూపులు ప్రచారం పొందుతున్నాయి.‘వ్యవస్థలు బొద్దింకలుగా చూసిన ప్రజల గొంతుకలమే మేము’’ అంటూ మీమ్స్, పోస్టులతో ప్రభుత్వాలపై విమర్శలు చేస్తున్నారు.

——-

9.నా కుమారుడి పెళ్లికి వెళ్తే చంపేస్తారు

ఇరాన్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.తన కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ వివాహానికి హాజరుకావడం కష్టమవొచ్చని తెలిపారు.భద్రతా కారణాలు, అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో నిర్ణయం తీసుకుంటానన్నారు.డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఈ వారాంతంలో బహమాస్‌లో బెట్టినా ఆండర్సన్‌ను వివాహం చేసుకోనున్నారు.సన్నిహితుల సమక్షంలోనే ఈ వివాహ వేడుక జరగనుందని సమాచారం.

——-

10.భవనం నిర్మించిన చైనా రోబోలు!

చైనా ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే హబ్‌లలో ఒకటైన చాంగ్‌కింగ్ ఈస్ట్ హైస్పీడ్ రైల్వే స్టేషన్‌ను కేవలం 38 నెలల్లో నిర్మించి చరిత్ర సృష్టించింది. 2022లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు 2025 జూన్‌లో పూర్తయ్యింది. భారీ స్థాయిలో రోబోలను వినియోగిస్తూ నిర్మాణ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. 12.2 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ హబ్‌లో హైస్పీడ్ రైళ్లు, మెట్రో, బస్సులు, ట్యాక్సీలు వంటి రవాణా సౌకర్యాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వీడియోను ఎలాన్ మస్క్ తన ఎక్స్ ఖాతాలో పంచుకోగా, తెగ చక్కర్లు కొడుతున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports