West Bengal Election Violence: బీజేపీ అభ్యర్థిని పరిగెత్తించి కొట్టారు | ముర్షిదాబాద్లో రణరంగం! | ACTPnews

West Bengal Election Violence: బీజేపీ అభ్యర్థిని పరిగెత్తించి కొట్టారు | ముర్షిదాబాద్లో రణరంగం!



పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ గురువారం (ఏప్రిల్ 23) భారీ హింసకు వేదికైంది. ముర్షిదాబాద్లోని నవోడాలో ఏజేయూపీ (AJUP) అధినేత, రెజినగర్ అభ్యర్థి హుమాయున్ కబీర్ కాన్వాయ్పై దుండగులు ఇటుకలు, కర్రలతో దాడి చేసి వాహనాలను ధ్వంసం చేశారు. అలాగే దక్షిణ దినాజ్పూర్లో కుమార్గంజ్ బీజేపీ అభ్యర్థి శుభేందు సర్కార్ను అల్లరిమూకలు పరిగెత్తించి కొట్టే ప్రయత్నం చేయగా, ఆయన తన ప్రాణాలను రక్షించుకోవడానికి సెక్యూరిటీతో కలిసి పరుగులు తీశారు. ముర్షిదాబాద్లోని పలు ప్రాంతాల్లో నాటు బాంబులు పేలడంతో అనేకమందికి గాయాలయ్యాయి. టీఎంసీ కార్యకర్తలు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని బీజేపీ ఆరోపించగా, విపక్షాలే అలజడి సృష్టిస్తున్నాయని టీఎంసీ ఎదురుదాడికి దిగింది. కూచ్ బెహార్, మాల్దా, సిలిగురి ప్రాంతాల్లో కూడా ఘర్షణలు చోటుచేసుకోవడంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత నెలకొంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed