Last Updated:
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ పవన్ సాధినేని వివాదంలో చిక్కుకున్నారు. ఓ సినీ నటి ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసినట్లు సమాచారం. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి తనను మోసం చేశాడని, చాలా కాలంగా తనతో సహజీవనం చేసి లైంగికంగా ఉపయోగించుకున్నారని సదరు నటి తన ఫిర్యాదులో ఆరోపించినట్లు తెలుస్తుంది.
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ పవన్ సాధినేని వివాదంలో చిక్కుకున్నారు. ఓ సినీ నటి ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసినట్లు సమాచారం. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి తనను మోసం చేశాడని, చాలా కాలంగా తనతో సహజీవనం చేసి లైంగికంగా ఉపయోగించుకున్నారని సదరు నటి తన ఫిర్యాదులో ఆరోపించినట్లు తెలుస్తుంది. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు పవన్ సాధినేనిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు సమాచారం. అనంతరం ఆయనను 15 రోజుల రిమాండ్కు తరలించినట్లు తెలుస్తోంది.














