Tollywood producer council: ఇటీవల మరణించిన నిర్మాతలకు సంతాపం తెలియజేసిన నిర్మాతల మండలి.. | | ACTPnews

టాలీవుడ్ నిర్మాతల మండలి (Tollywood producers council)


Last Updated:

Tollywood producer council: తెలుగు ఇండస్ట్రీలో మరణ మృదంగం మోగుతుంది. ఇటీవల కాలంలో చాలా మంది సినీ ప్రముఖులు మరణించారు. ఈ ప్రముఖులలో దర్శకులు, నటులు మాత్రమే కాదు చాలా మంది నిర్మాతలు కూడా ఉన్నారు.

టాలీవుడ్ నిర్మాతల మండలి (Tollywood producers council)
టాలీవుడ్ నిర్మాతల మండలి (Tollywood producers council)

తెలుగు ఇండస్ట్రీలో మరణ మృదంగం మోగుతుంది. ఇటీవల కాలంలో చాలా మంది సినీ ప్రముఖులు మరణించారు. తాజాగా జర్నలిస్ట్, నటుడు టిఎన్ఆర్ కూడా మన మధ్య నుంచి వెళ్లిపోయారు. ఈ ప్రముఖులలో దర్శకులు, నటులు మాత్రమే కాదు చాలా మంది నిర్మాతలు కూడా ఉన్నారు. అలా ఈ మధ్య స్వర్గస్తులైన కొందరు నిర్మాతలను నిర్మాతల మండలి గుర్తు చేసుకుంది. వాళ్ల సంతాప సభ ఏర్పాటు చేసింది. డాక్టర్ ఎం. గంగయ్య గారు , శ్రీమతి కొడాలి అనిత గారు, శ్రీ ఎం.ఎస్. ప్రసాద్ గారు, శ్రీ సి. శ్రీధర్ రెడ్డి గారు (నిర్మాతలు) ఈ మధ్యే మరణించారు. అనారోగ్యంతో కొందరు పోతే.. కరోనాతో మరికొందరు చనిపోయారు. వీళ్ల సంతాప సభ ఫిల్మ్ చాంబర్ లో జరిగింది. కాజా సూర్య నారాయణ గారు మాట్లాడుతూ ఈ రోజు ఈ నలుగురు మనతో లేకపోవటం చాలా బాధాకరం ముఖ్యంగా ఎమ్ స్ ప్రసాద్ గారు నాకు మంచి మిత్రుడు, గంగయ్య గారు మరియు సి.శ్రీధర్ రెడ్డి గారు, కొడాలి అనిత గారు వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలి అని వాళ్ళు ఫ్యామిలీస్ కి నా సానుభూతి తెలియచేస్తున్నాను.

తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రెటరీ తుమ్మల ప్రసన్న కుమార్ గారు మాట్లాడుతూ గంగయ్య గారు రాజమండ్రి లో సేవ కార్యక్రమాలు చేసే వారు, ఏ మ్ స్ ప్రసాద్ గారు మంచి మిత్రుడు తను లేకపోవటం తీరని లోటు , సి. శ్రీధర్ రెడ్డి గారు లేకపోవటం తీరని లోటు, కొడాలి అనిత గారు సీరియల్స్ నిర్మించారు తనని కోల్పవటం చాలా బాధాకరమైన విషయం, వీళ్లందరి ఆత్మకు శాంతి చేకూరాలి అని వీళ్ళ ఫ్యామిలీస్ కి నా ప్రగాఢ సానుభూతి తెలియచేసుకుంటున్నాను. ప్రొడ్యూసర్ మోహన్ గౌడ్ గారు మాట్లాడుతూ ఈ నలుగురి ఆత్మకు శాంతి చేకురాలి అలాగే వీళ్లందరి కుటుంబాలకి నా సానుభూతి తెలియచేస్తున్నాను అన్నారు.

టాలీవుడ్ నిర్మాతల మండలి (Tollywood producers council)

నిర్మాత సి. శ్రీధర్ రెడ్డి గారి కుమార్తె మాట్లాడుతూ నా తండ్రిని కోల్పవటం మా ఫ్యామిలీ కి తీరని లోటు ఇంత క్లిష్ట పరిస్థితులు లో కూడా సంతాప సభ ఏర్పాటు చేయటం గర్వించదగ్గ పరిణామం అలాగే మిగతా ఫ్యామిలీస్ కి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఆచంట గోపినాధ్ గారు మాట్లాడుతూ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుచి ఇలాంటి బాధాకరమైన వార్తలు వినకూడదు అని దేవుడిని పార్ధిస్తూ ఈ నలుగురికి ఆత్మ శాంతిచాలని కోరుకుంటున్నాను.. అని తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed