Last Updated:
యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన టాక్సిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని మల్లారెడ్డి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగింది. అయితే ఈ ఈవెంట్ జరుగుతున్న సమయంలో ఊహించని ప్రమాదం చోటు చేసుకోవడంతో అంతా షాకయ్యారు.
పాన్ ఇండియా స్టార్, ‘కేజీఎఫ్’ ఫేమ్ యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా ‘టాక్సిక్’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో తీవ్ర అపశృతి చోటుచేసుకుంది. శనివారం రాత్రి హైదరాబాద్‌లోని మల్లారెడ్డి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఈ చిత్ర ప్రమోషన్ వేడుకను అట్టహాసంగా నిర్వహించారు. అయితే, తమ అభిమాన హీరోను చూసేందుకు వేలాదిగా విద్యార్థులు, ప్రేక్షకులు తరలిరావడంతో అక్కడ ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో సౌండ్ సిస్టమ్, ఫ్లడ్ లైట్లు అమర్చిన భారీ స్ట్రక్చర్ అదుపుతప్పి కిందపడటంతో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.














