Last Updated:
టాక్సిక్‌లో బెడ్ రూమ్ సీన్, కియారాతో శృతిమించిన రొమాన్స్, ఇదొక్కటి చాలు మావ బాక్సాఫీస్ షేక్ కావడానికి.. ఇప్పుడు సినీ వర్గాల్లో నడుస్తున్న చర్చ ఇదే.
‘కేజీఎఫ్’ (KGF) సిరీస్‌తో బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించి, పాన్ ఇండియా స్టార్‌గా అవతరించిన రాకింగ్ స్టార్ యష్ (Yash) తదుపరి చిత్రంపై దేశవ్యాప్తంగా అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. దాదాపు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత యష్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘టాక్సిక్: ఎ ఫెరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ (Toxic Movie). ప్రముఖ మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యమవుతున్నప్పటికీ, దీనిపై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, బజ్ ఏమాత్రం తగ్గలేదు. అయితే ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్స్‌లో ఈ సినిమాకి సంబంధించిన ఒక సెన్సేషనల్ న్యూస్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో రాకింగ్ స్టార్ యష్, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ మధ్య అత్యంత ఘాటైన రొమాంటిక్ బెడ్ రూమ్ సీన్ ఉండబోతోందన్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.
సాధారణంగా యష్ నుంచి ప్రేక్షకులు భారీ యాక్షన్, ఎలివేషన్స్ ఆశిస్తారు. కానీ, ఈ సినిమా టైటిల్ ట్యాగ్‌లైన్ ‘ఎ ఫెరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ (పెద్దల కోసం ఒక అద్భుత కథ) కు తగ్గట్టుగానే దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ఈ చిత్రాన్ని చాలా డార్క్, బోల్డ్ అండ్ ఇంటెన్స్ అప్రోచ్‌తో విభిన్నంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ప్రచార చిత్రాలలో కారులో వచ్చే ఒక శృంగార సన్నివేశాన్ని చూపించి మేకర్స్ తమ ఉద్దేశాన్ని స్పష్టం చేశారు. ఆ విజువల్స్ రేపిన వేడి చల్లారకముందే, ఇప్పుడు కియారాతో యష్ సీన్స్ కమర్షియల్ సినిమాల హద్దులు చెరిపేసేలా డిజైన్ చేశారని ఇండస్ట్రీ వర్గాల టాక్.
ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రంలో యష్ సరసన తారా సుతారియా, నయనతార, కియారా అద్వానీ వంటి స్టార్ హీరోయిన్లు నటిస్తుండటం విశేషం. అయితే, కియారాతో వచ్చే ఆ ఘాటైన సన్నివేశం కేవలం గ్లామర్ కోసమే ఇరికించింది కాదని, కథలోని డార్క్ ఎమోషన్స్, క్యారెక్టర్ల మధ్య ఉండే రిలేషన్షిప్స్ డైనమిక్స్‌ను మలుపు తిప్పే కీలక ఘట్టంగా ఉంటుందని మేకర్స్ సమర్థిస్తున్నారు. డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ తన గత చిత్రాల తరహాలోనే కథ డిమాండ్ మేరకు ఎలాంటి రాజీ పడకుండా రియలిస్టిక్‌గా ఈ సీన్‌ను చిత్రీకరించారట.
అయితే, ‘కేజీఎఫ్’ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న సినిమా తర్వాత యష్ ఇలాంటి ‘ఏ’ (Adult) సర్టిఫికెట్ రేంజ్ బోల్డ్ కంటెంట్‌ను ఎంచుకోవడం పట్ల అభిమానుల్లోనూ, విమర్శకుల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కారు సన్నివేశంపై ఇప్పటికే కొన్ని విమర్శలు రాగా, తాజా లీక్స్ ఆ విమర్శలను మరింత పెంచే అవకాశం ఉంది. యష్ తన ఇమేజ్ చట్రం నుండి బయటపడి చేస్తున్న ఈ ప్రయోగాత్మక యాక్షన్ డ్రామా రిలీజ్ తర్వాత ఆయన కెరీర్‌కి ప్లస్ అవుతుందా? లేక అనవసర వివాదాల్లోకి నెట్టుందా? అన్నది కాలమే నిర్ణయించాలి. ఆగస్టు 26న ఈ సినిమా రిలీజ్ కానుంది.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana














