Last Updated:
తిరుపతి జిల్లా చింతాపూడి గ్రామానికి చెందిన మణి తెల్లగూటి పేరు ప్రస్తుతం ‘త్రికాల’ సినిమాతో సినీ వర్గాల్లో ప్రత్యేకంగా వినిపిస్తోంది. రైతు కుటుంబంలో పుట్టిన ఆయనకు చిన్నతనం నుంచే సినిమాలతో అనుబంధం ఏర్పడింది.
తిరుపతి జిల్లా చింతాపూడి గ్రామానికి చెందిన మణి తెల్లగూటి ‘త్రికాల’ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. రైతు కుటుంబంలో పుట్టిన ఆయనకు చిన్నతనం నుంచే సినిమాలతో అనుబంధం ఏర్పడింది. తండ్రి సినిమా ఆపరేటర్ కావడంతో మణి ప్రొజెక్టర్ గది, వెండితెర, సినిమా వాతావరణం ఆయన బాల్యంలోనే జీవితంలో భాగమయ్యాయి. సినిమాలను చూస్తూ పెరిగిన మణికి ఒకరోజు తానే సినిమా తెరకెక్కించాలనే ఆలోచన కలిగింది. ఆ కలను నిజం చేసుకునే ప్రయాణంలో ముందుగా VFX రంగంలోకి అడుగుపెట్టారు. సాంకేతిక నైపుణ్యాన్ని పెంచుకున్న తర్వాత ఎడిటింగ్‌లో పనిచేశారు. దీంతో కథను తెరపై ఎలా చెప్పాలి? ఒక సన్నివేశానికి ఎలాంటి విజువల్స్ అవసరం? ప్రేక్షకుడిపై ఎలాంటి ప్రభావం చూపించాలి? అనే అంశాలపై మంచి అవగాహన ఏర్పడింది.














